ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికాకు బయలుదేరడానికి సిద్ధమవుతోంది. కానీ, దక్షిణాఫ్రికా క్రికెట్(సీఎస్ఏ) బోర్డులో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. ఎటు తేలడం లేదు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో పర్యటన రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వివాదం ఏంటి?
సీఎస్ఏలో 9 మందితో కూడిన మధ్యంతర బోర్డును ఆ దేశ క్రీడాశాఖ మంత్రి నతీ తెత్వా రెండు వారాల కింద నియమించారు. దీనికి మాజీ న్యాయమూర్తి జాక్ యాకూబ్ నేతృత్వం వహించనున్నారు. కానీ, దీన్ని గుర్తించడానికి సీఎస్ఏ మండలి సభ్యులు నిరాకరిస్తున్నారు. దాంతో.. బోర్డు మొత్తాన్నే రద్దు చేస్తానని హెచ్చరించారు మంత్రి. "ఇంగ్లాండ్ ఏం ఆలోచిస్తోందో తెలియదు. మండలిలోని సభ్యులు సాయంత్రానికల్లా సరైన నిర్ణయం తీసుకోకపోతే.. ఇంగ్లాండ్ జట్టు రాకను అనుమతించబోమని" జాక్ యాకూబ్ అన్నారు.
ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల మధ్య ఇంగ్లాండ్ పర్యటన మొత్తం రద్దయ్యే ప్రమాదముందని సీఎస్ఏ ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇదీ చదవండి:ఆస్ట్రేలియా గడ్డపై భారత్ దూసుకెళ్లేనా?