ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ శనివారం ఆరంభమయ్యే రెండో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో మోచేతి గాయానికి గురైన ఆర్చర్ తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) తెలిపింది. అహ్మదాబాద్ టెస్టు సమయానికి అతడు ఫిట్‌నెస్ సాధించే అవకాశముంది. ఆర్చర్ స్థానంలో స్టువర్ట్ బ్రాడ్ తుది జట్టులోకి రానున్నాడు.
భారత్‌తో టీ20లకు ఇంగ్లాండ్ జట్టిదే:
భారత్‌తో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు.
ఇంగ్లాండ్ జట్టు:
ఇయాన్ మోర్గాన్, మొయిన్ అలీ, జోఫ్రా అర్చర్, బెయిర్‌స్టో, సామ్ బిలింగ్స్, బట్లర్, సామ్ కరన్, టామ్ కరన్, క్రిస్ జోర్డాన్, లివింగ్ స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జేసన్ రే, బెన్ స్టోక్స్, రీస్ టోప్లే, మార్క్ వుడ్.
ఇదీ చూడండి: చెపాక్ స్టేడియం వద్ద టికెట్ల కోసం రచ్చ