ETV Bharat / sports

ఇంగ్లాండ్​ vs పాకిస్థాన్​: బయోసెక్యూర్​ బుడగలో టెస్టు సిరీస్​ - ఇంగ్లాండ్ కెప్టెన్​ జోరూట్​

కరోనా కారణంగా ఆగిపోయిన క్రికెట్​ను మళ్లీ తిరిగి ప్రారంభించడంలో ఇంగ్లాండ్​ ప్రధానపాత్ర పోషించింది. బయో సెక్యూర్​ వాతావరణంలో జులై 8 నుంచి వెస్టిండీస్​తో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను నిర్వహించి అందులో విజయం సాధించింది. పాకిస్థాన్​తో మూడు మ్యాచ్​ల సిరీస్​కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి తొలి టెస్టు జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

England vs Pakistan 2020 1st Test: Two spinners for visiting team, hosts likely to remain unchanged
ఇంగ్లాండ్​ vs పాకిస్థాన్​: బయోసెక్యూర్​ బుడగలో టెస్టు సిరీస్​
author img

By

Published : Aug 5, 2020, 8:15 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆగిపోయిన క్రికెట్‌ను తిరిగి మైదానంలోకి తీసుకొచ్చి.. వెస్టిండీస్‌తో సిరీస్‌ను విజయవంతంగా నిర్వహించిన ఇంగ్లాండ్‌.. పాకిస్థాన్‌తో పోరుకు తయారైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి పోరుకు రంగం సిద్ధమైంది. సొంతగడ్డపై, వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను 2-1తో గెలిచిన ఇంగ్లాండే ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా బరిలో దిగనుంది. అయితే ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించని పాకిస్థాన్‌ను తక్కువ అంచన వేయలేం.

ఈ సిరీస్‌ కోసం మొదట ప్రకటించిన 29 మంది సభ్యుల జట్టులో పది మంది ఆటగాళ్లకు కరోనా సోకడం వల్ల షాక్‌కు గురైన పాకిస్థాన్‌.. ఆ సంఘటన నుంచి తేరుకుని మ్యాచ్‌కు మెరుగ్గానే సన్నద్ధమైంది. దాదాపు నెల రోజుల కంటే ముందే అక్కడికి చేరుకుని.. క్వారంటైన్‌ పూర్తి చేసుకుని.. తమ ఆటగాళ్లనే రెండు జట్లుగా విభజించి సన్నాహక మ్యాచ్‌లాడి లయ అందుకుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30కి ఆరంభమయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ సిక్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఆ జోరు అలాగే..

విండీస్‌తో తొలి టెస్టులో ఓడినప్పటికీ తిరిగి పుంజుకొని వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్‌ సొంతం చేసుకున్న ఇంగ్లాండ్‌.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లోనూ అదే ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలని భావిస్తోంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న ఆ జట్టు ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మరోసారి సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. వెస్టిండీస్‌తో చివరి టెస్టు ఆడిన జట్టునే పాక్‌తో తొలి మ్యాచ్‌లో బరిలో దింపే అవకాశం ఉంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో పోరు అంటే ఏ జట్టుకైనా కఠిన పరీక్షే. అక్కడి బౌన్సీ, స్వింగ్‌ పిచ్‌లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు సవాళ్లు విసురుతాయి. ఇలాంటి ప్రతికూలతల మధ్య ఆ జట్టును పాక్‌ ఎలా నిలువరిస్తుందో చూడాలి.

అయితే గత రెండు పర్యటనలను (2016లో 2-2, 2018లో 1-1) పాక్‌ డ్రాగా ముగించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. జట్టు బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది. యువ పేసర్లు నసీమ్‌ షా, షహీన్‌ అఫ్రిది ఉరకలెత్తే ఉత్సాహం మీద ఉన్నారు. ఇద్దరు స్పిన్నర్లతో పాక్‌ బరిలోకి దిగాలని భావిస్తోంది కాబట్టి షాదాబ్‌, యాసిర్‌ షా తుది జట్టులో ఉండనున్నారు. మరోవైపు బ్యాటింగ్‌ భారం మొత్తం బాబర్‌ అజామ్‌ మీదే ఉంది. గత కొన్నేళ్లుగా గొప్ప ఆటతీరుతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకున్న బాబర్​ అజామ్​తో పాటు కెప్టెన్‌ అజార్‌ అలీ రాణించాల్సిన అవసరం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.