ఈ ఏడాది జులై 30 నుంచి ఐర్లాండ్‌తో జరగబోయే మూడు మ్యాచుల వన్డే సిరీస్‌కు సంబంధించి జట్టును ప్రకటించింది ఇంగ్లాండ్. ఈ జట్టులో టామ్ బ్యాంటన్, రిసీ టోప్లేలకు చోటు కల్పించింది. జట్టుకు మరింత బలం చేకూర్చేందుకు వీరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ టీమ్‌కు ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనుండగా.. మొయిన్ అలీ వైస్ కెప్టెన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. 2023 వన్డే ప్రపంచకప్ అర్హత కోసం.. ప్రారంభమయ్యే సూపర్ లీగ్ ఈ సిరీస్‌తోనే ఆరంభం కానుంది.
స్క్వాడ్ : ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, టామ్ బ్యాంటన్, సామ్ బిల్లింగ్స్, టామ్ కురాన్, లియామ్ డాసన్, జో డెన్లీ, సాకిబ్ మహమూద్, అదిల్ రషీద్, జాసన్ రాయ్, రీస్ టోప్లే, జేమ్స్ విన్స్, డేవిడ్ విల్లే
రిజర్వ్ బెంచ్ : రిచర్డ్ గ్లీసన్, లూయిస్ గ్రెగొరీ, లియామ్ లివింగ్‌స్టోన్.
ఇది చూడండి జులై 30 నుంచివన్డే ప్రపంచకప్ సూపర్‌లీగ్ ప్రారంభం