టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంగ్లాండ్ మరో మైలురాయిని అధిగమించింది. టెస్టుల్లో ఐదు లక్షల పరుగులు చేసిన మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని వాండరర్స్ మైదానంలో జరుగుతున్న చివరిదైన నాలుగో టెస్ట్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. శుక్రవారం ఈ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లాండ్ సారధి జో రూట్ తీసిన సింగిల్‌తో ఆ టీమ్ అర మిలియన్ పరుగుల ఘనతను సొంతం చేసుకుంది. ఇది ఇంగ్లాండ్ జట్టు ఆడిన 1022వ టెస్ట్ మ్యాచ్.
ఇంగ్లాండ్ తరువాత 830 టెస్టుల్లో 4,32,706 పరుగులను సాధించిన ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా... భారత్ 540 టెస్టుల్లో 2,73,518 పరుగులు తీసి మూడో స్థానంలో నిలిచింది. 545 టెస్టుల్లో 2,70,441 పరుగులు సాధించిన వెస్టిండీస్ నాలుగో స్థానంలో ఉంది.
-
HALF A MILLION! 😮
— England Cricket (@englandcricket) January 24, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
The first country to the milestone! 👏 pic.twitter.com/jodkHN8fcb
">HALF A MILLION! 😮
— England Cricket (@englandcricket) January 24, 2020
The first country to the milestone! 👏 pic.twitter.com/jodkHN8fcbHALF A MILLION! 😮
— England Cricket (@englandcricket) January 24, 2020
The first country to the milestone! 👏 pic.twitter.com/jodkHN8fcb
విదేశాల్లో 500 టెస్టులు...
ఇంగ్లాండ్ సాధించిన మరో ఘనతకు కూడా దక్షిణాఫ్రికానే వేదికైంది. ఇక్కడి పోర్ట్ ఎలిజబెత్‌లోని సెయింట్ జార్జ్ పార్క్‌లో ఆడిన మూడో టెస్ట్‌తో విదేశీ గడ్డ మీద 500 టెస్టులు ఆడిన గౌరవాన్ని ఇంగ్లాండ్ దక్కించుకుంది. ఈ కేటగిరీలో 404 మ్యాచ్‌లతో ఆస్ట్రేలియా రెండో జట్టుగా నిలిచింది.
భారత్ ఇప్పటి వరకు విదేశాల్లో 268 టెస్ట్‌మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 51 మ్యాచ్‌లలో విజయం సాధించగా 113 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలిన 104 మ్యాచ్‌లను డ్రాగా ముగిశాయి.