చెపాక్ వేదికగా జరుగుతోన్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ 134 పరుగులకు ఆలౌటైంది. స్పిన్‌కు సహకరిస్తున్న పిచ్‌పై భారత బౌలర్లు పండుగ చేసుకున్నారు. టీ సమయానికి 106/8తో ఉన్న ఇంగ్లిష్ జట్టు.. విరామం అనంతరం ఆచితూచి ఆడింది. నిలకడగా ఆడిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెన్ ఫోక్స్ 42* పరుగులతో ఆకట్టుకున్నాడు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సిన ఆ జట్టు.. మూడో సెషన్లో మరో 28 పరుగులు జోడించి కుప్పుకూలింది.
భారత్ బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరోసారి 5వికెట్లతో మెరిశాడు. అక్షర్ పటేల్-2 వికెట్లు నేలకూల్చగా.. పేసర్లలో ఇషాంత్ శర్మ-2, మహ్మద్ సిరాజ్ ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఫాల్ఆన్ ఆడించకుండానే..
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 134కు చుట్టేసి.. 195 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది భారత్. ఈ క్రమంలో ఫాలోఆన్‌లో పడిన ప్రత్యర్థి జట్టును మరోసారి బ్యాటింగ్‌కు ఆహ్వానించకుండా.. భారత బ్యాట్స్‌మెన్ క్రీజులోకి అడుగుపెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో వీలైనన్ని పరుగులు చేసి.. పర్యటక జట్టు ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలనుకుంటోంది కోహ్లీసేన.
అంతకుముందు.. 300/6 స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన టీమ్ ఇండియా.. మరో 29 పరుగులు జోడించి ఆలౌట్ అయింది. వికెట్ కీపర్ రిషభ్ పంత్-58*(77 బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు) మరోసారి అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు.
ఇవీ చదవండి: