ETV Bharat / sports

సౌథాంప్టన్​ టెస్టు: 204 పరుగులకే ఇంగ్లాండ్​ ఆలౌట్​

author img

By

Published : Jul 9, 2020, 8:49 PM IST

సౌథాంప్టన్​ వేదికగా వెస్టిండీస్​తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్​లో 204 పరుగులకే ఆలౌట్​ అయింది ఇంగ్లాడ్​ . కరీబియన్​ బౌలర్ల ధాటికి ఇంగ్లీష్ బ్యాటింగ్​ టాప్​ ఆర్డర్​ కుప్పకూలింది. విండీస్​ కెప్టెన్​ జేసన్​ హోల్డర్​ 6 వికెట్లు సాధించి ప్రత్యర్థి జట్టును కట్టడి చేశాడు.

ENG vs WI: Jason Holder-Led West Indies Wrap England For 204
సౌథాంప్టన్​ టెస్టు: 204 పరుగులకే ఇంగ్లాండ్​ ఆలౌట్​

బయోసెక్యూర్‌ వాతావరణంలో ఇంగ్లాండ్‌, వెస్టిండీస్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. కరీబియన్‌ బౌలర్ల ధాటికి ఇంగ్లీష్​ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే ఆలౌట్​ అయ్యింది.

విండీస్​ కెప్టెన్​, ఆల్​రౌండర్ జేసన్​ హోల్డర్ 6 వికెట్లతో విజృంభించాడు. గాబ్రియెల్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ​​ఇంగ్లాండ్​ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (43; 93 బంతుల్లో 7×4) అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

తొలిరోజు తర్వాత

ఓవర్‌నైట్‌ స్కోరు 35/1తో రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ కాసేపటికే జో డెన్లీ (18; 58 బంతుల్లో 4×4) వికెట్‌ చేజార్చుకుంది. 23 వ ఓవర్​ 2వ బంతికి అతడిని షానన్‌ గాబ్రియెల్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. నిలకడగా ఆడుతున్న ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ (30; 85 బంతుల్లో 4×4)ను సైతం అతడికే వికెట్ల‌ ముందు ఎల్బీడబబ్ల్యూ రూపంలో దొరికాడు. ఆ తర్వాత విండీస్‌ కెప్టెన్ హోల్డర్‌ వికెట్ల పతనం మొదలుపెట్టాడు. జాక్‌ క్రాలీ (10; 26 బంతుల్లో 2×4), ఒలివ్‌ పోప్‌ (12; 13 బంతుల్లో 2×4)ను పెవిలియన్‌ పంపించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.