ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్‌తో తననెందుకు పోలుస్తారో అర్థం కాదని టీమ్‌ఇండియా మాజీ సారథి, కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. వార్న్, మురళీధరన్ తర్వాత ఎక్కువ వికెట్లు తీసినందుకు గొప్పగా అనిపిస్తుందని వెల్లడించాడు.
"ఎక్కువ వికెట్లు తీసినందుకు గొప్పగా అనిపిస్తుంది. అయితే గణాంకాలు, సగటు గురించి ఎక్కువగా ఆలోచించను. రోజంతా బౌలింగ్ చేసి వికెట్లు తీయాలన్నదే నా అభిమతం. షేన్‌వార్న్, మురళీధరన్ తర్వాత టెస్టుల్లో ఎక్కువ వికెట్లు తీయడం ప్రత్యేకం. ఎందుకంటే మేము ఒకేతరంలో ఆడాం. అందుకే ఎక్కువ పోలికలు వచ్చాయి. కానీ ప్రజలు వార్న్‌తో ఎందుకు నన్ను పోలుస్తారో అర్థం కాదు. అతడు చాలా భిన్నం. వారిద్దరూ ఎలాంటి పిచ్‌పై అయినా బంతిని గింగిరాలు తిప్పగలరు. అందుకే వార్న్, మురళీతో నన్ను పోల్చినప్పుడు నిజంగా ఇబ్బందిగా అనిపిస్తుంది. వారిద్దరినీ చూసి నేనెన్నో విషయాలు నేర్చుకున్నా."
-కుంబ్లే, టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్
2008లో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కుంబ్లే సుదీర్ఘ ఫార్మాట్‌లో 619 వికెట్లు సాధించాడు. ముత్తయ్య మురళీధరన్ 800, షేన్‌వార్న్ 708 వికెట్లు పడగొట్టారు. కాగా జిమ్‌లేకర్ తర్వాేత ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన ఘనత మాత్రం కుంబ్లేకే దక్కింది. అదీ దాయది పాక్‌పై కావడం గమనార్హం.