ETV Bharat / sports

'ధోనీ రూ. 30 లక్షలు చాలనుకున్నాడు' - విదర్భ క్రికెటర్​

మహేంద్ర సింగ్​ ధోనీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు టీమిండియా మాజీ బ్యాట్స్​మన్​ వసీం జాఫర్​. ఒకానొక దశలో ధోనీ.. రూ. 30 లక్షలు సంపాదిస్తే చాలని తనతో చెప్పినట్లు ట్వీట్​ చేశాడు జాఫర్​.

Dhoni wanted to earn Rs 30lakh and live peacefully: Wasim
'ధోనీకి రూ. 30 లక్షలు సరిపోతాయట'
author img

By

Published : Mar 30, 2020, 6:44 AM IST

భారత క్రికెట్‌లో మాజీ సారథి ఎంఎస్ ధోనీ ఎన్నో రికార్డులు సృష్టించాడు. వన్డే, టీ20 ప్రపంచకప్‌లను గెలిచాడు. అత్యుత్తమ ఫినిషర్‌గా, ప్రచారకర్తగా మెరిశాడు. అయితే ధోనీ తన క్రికెట్‌ కెరీర్‌ తొలి కాలంలో రూ.30 లక్షలు సంపాదిస్తే చాలనుకున్నాడని టీమ్‌ఇండియా మాజీ బ్యాట్స్‌మన్‌ వసీమ్‌ జాఫర్‌ అన్నాడు. ట్విట్టర్‌లో ఓ అభిమాని ధోనీతో నీకు ఉన్న ఏదైనా మంచి జ్ఞాపకాన్ని పంచుకోవాలని కోరగా జాఫర్‌ ఇలా బదులిచ్చాడు.

'భారత జట్టులోకి వచ్చిన తొలి రెండేళ్లలో ధోనీ ఒక సారి నాతో ఇలా అన్నాడు. క్రికెట్‌ ఆడి రూ.30 లక్షలు సంపాదించి.. ఆ తర్వాత మిగిలిన జీవితాన్ని రాంచీలో ప్రశాంతంగా గడపాలి' అని ధోనీ తనతో అన్నాడని జాఫర్‌ ట్వీటాడు.

2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేతో ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్‌ మొదలుపెట్టాడు. గత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ తర్వాత క్రికెట్‌కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్‌తో పునరాగమనం చేయాలనుకున్నాడు. కానీ కరోనా ఎఫెక్ట్​తో అది కాస్తా వాయిదా పడింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.