ETV Bharat / sports

కెప్టెన్సీకి ధోనీ టాటా.. కొత్త సారథి ఎవరంటే?

వచ్చే ఐపీఎల్​లో ధోనీ కేవలం ఆటగాడినే కనిపించనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు ఆల్​రౌండర్ బ్రావో. కెప్టెన్సీ నుంచి తప్పుకుని కొత్త వాళ్లకు ఆ బాధ్యతలు అందజేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు.

dhoni
ధోనీ
author img

By

Published : Sep 6, 2020, 2:16 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్​​ చరిత్రలో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్​కింగ్స్ అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడుసార్లు విజేతగా నిలవడం సహా ఎనిమిది సార్లు ఫైనల్స్​ ఆడింది. ఈ ఘనతంతా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే దక్కుతుంది. ఒకవేళ అతడు సారథిగా తప్పుకుంటే జట్టును నడిపించేది ఎవరు? ఈ సందేహం ప్రతి అభిమానికి ఉండొచ్చు. మహీ కూడా సారథిగా తప్పుకోవాలని అనుకుంటున్నట్లు సీఎస్కే ఆల్​రౌండర్​ డ్రేన్​ బ్రావో చెప్పాడు. వచ్చే సీజన్​ నుంచి ధోనీ ఆటగాడిగానే కొనసాగొచ్చని తెలిపాడు. సురేశ్​ రైనా లేదా యువ ఆటగాళ్లకు జట్టు పగ్గాలు అప్పచెప్పాలని మహీ భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్​కు ఆగస్టు 15న వీడ్కోలు పలికాడు ధోనీ. దాదాపు 16 ఏళ్ల పాటు జట్టుకు సేవలందిచాడు. కెప్టెన్​గా, ఆటగాడిగా ఎన్నో విజయాలను అందించాడు. ఐపీఎల్​లో​ ఆడేందుకు దుబాయ్​లో ఉన్న మహీ.. క్వారంటైన్​ పూర్తిచేసుకుని ప్రాక్టీసు చేస్తున్నాడు.

ఇదీ చూడండి స్మిత్​ ఆవలింతపై సర్ఫరాజ్​ భార్య ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.