ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టుతో టెస్టు అరంగేట్రం చేసిన టీమ్ఇండియా ఆటగాళ్లు శుభమన్ గిల్, మహ్మద్ సిరాజ్‌ను ప్రశంసించాడు భారత జట్టు తాత్కాలిక సారథి అజింక్యా రహానె. వీరిద్దరు అద్భుతంగా ఆడారని కొనియాడాడు. బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్‌పై గెలిచిన అనంతరం మాట్లాడిన రహానె పలు అంశాలపై మ ాట్లాడాడు.
-
https://t.co/eQNZo0Ou2G! 👏👏#TeamIndia bounce back in style to beat Australia by 8⃣ wickets to level the four-match series. 👍👍 #AUSvIND
— BCCI (@BCCI) December 29, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard 👉 https://t.co/lyjpjyeMX5 pic.twitter.com/FgepGB00uE
">https://t.co/eQNZo0Ou2G! 👏👏#TeamIndia bounce back in style to beat Australia by 8⃣ wickets to level the four-match series. 👍👍 #AUSvIND
— BCCI (@BCCI) December 29, 2020
Scorecard 👉 https://t.co/lyjpjyeMX5 pic.twitter.com/FgepGB00uEhttps://t.co/eQNZo0Ou2G! 👏👏#TeamIndia bounce back in style to beat Australia by 8⃣ wickets to level the four-match series. 👍👍 #AUSvIND
— BCCI (@BCCI) December 29, 2020
Scorecard 👉 https://t.co/lyjpjyeMX5 pic.twitter.com/FgepGB00uE
"ఐదుగురు బౌలర్ల ప్రణాళిక చాలా బాగా పనిచేసింది. గిల్ ఫస్ట్ క్లాస్ కెరీర్ గురించి మనందరికీ తెలిసిందే. ఆ అనుభవంతోనే ఈ పోరులో బాగా తీవ్రతతో ఆడాడు. అలాగే సిరాజ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నిజానికి కొత్తగా వచ్చేవాళ్లు సరిగ్గా ఆడలేరు. కానీ వీరిద్దరూ మంచి ప్రదర్శన చేశారు. ప్రతిఒక్కరూ తీవ్రతతో ఆడారు. అడిలైడ్(తొలి) టెస్టులో ఒక్క గంటలో అంతా తారుమారైపోయింది. కాబట్టి రెండో టెస్టు గెలిచినప్పటికీ మేము నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని నా అభిప్రాయం. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ చివరి ఐదు వికెట్లను తమకు తామే సమర్పించుకుంది. ఉమేశ్ యాదవ్ కోలుకుంటున్నాడు. మూడో టెస్టులో అతడు ఆడే విషయమై మేనేజ్మెంట్, వైద్య బృందం నిర్ణయం తీసుకుంటారు. నిన్ననే రోహిత్‌తో మాట్లాడాను. అతడి రాక కోసం టీమ్ఇండియా ఎదురుచూస్తోంది. అలానే జట్టులో కలవడం కోసం అతను కూడా ఎంతో ఆత్రుతగా ఉన్నాడు."
-రహానె, టీమ్ఇండియా క్రికెటర్.
నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో తొలి టెస్టులో ఆసీస్ గెలవగా.. రెండో మ్యాచులో టీమ్ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి 1-1తో సిరీస్‌ను సమం చేసింది. సిడ్నీ వేదికగా మూడో టెస్టు జనవరి 7నుంచి ప్రారంభంకానుంది. రెండో పోరు నుంచి సారథి కోహ్లీ గైర్హాజరీ కారణంగా రహానె తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.
ఇదీ చూడండి : ఆసీస్‌పై భారత్ విజయం.. సిరీస్ 1-1తో సమం