ETV Bharat / sports

'స్మిత్​ పవర్ హిట్టర్​ కాదు.. టీ20కి పనికిరాడు' - Steve Smith latest news

ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆ దేశ మాజీ ఆటగాడు డీన్ జోన్స్. స్మిత్​ను టీ20 జట్టులోకి తీసుకోకపోవటమే మంచిదని అభిప్రాయపడ్డాడు.

డీన్
డీన్
author img

By

Published : Jun 3, 2020, 5:49 AM IST

ఆస్ట్రేలియా మాజీ సారథి, సీనియర్ క్రికెటర్ స్టీవ్ స్మిత్​ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు మాజీ ఆసీస్ క్రికెటర్ డీన్ జోన్స్. టీ20 జట్టులో స్మిత్​కు బదులు పవర్ హిట్టర్లయిన మ్యాక్స్​వెల్​ లాంటి వారికి అవకాశం ఇవ్వాలని సూచించాడు. అలాగే టెస్టు జట్టుకు టిమ్ పైన్​ను కెప్టెన్​గా కొనాసాగించాలని తెలిపాడు. బాల్​టాంపరింగ్​ కారణంగా రెండేళ్లు కెప్టెన్సీ నిషేధం ఎదుర్కొన్నాడు స్మిత్. ఈ నిషేధం ఇటీవల పూర్తయింది.

"టిమ్ పైన్ జట్టును బాగానే నడిపిస్తున్నాడు. అయితే స్మిత్​ ఇంకా కెప్టెన్సీని కోరుకుంటున్నాడా? అలా అనుకోవడం లేదని నేను భావిస్తున్నా. అలాగే స్మిత్​ టీ20 జట్టుకు సరిపోతాడా? నాకు తెలిసి స్మిత్​ది బంతిని బలంగా బాదే స్వభావం కాదు. ప్రస్తుతం ఆరోన్ ఫించ్ కూడా పరిమిత ఓవర్ల జట్టును ముందుకు తీసుకెళ్తున్నాడు."

-డీన్ జోన్స్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్

స్మిత్ ఇప్పటివరకు 39 టీ20లు ఆడాడు. 681 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్ధసెంచరీలు ఉన్నాయి. 2010, 2016 టీ20 ప్రపంచకప్​ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఈ మెగాటోర్నీల్లో ఆడిన 11 మ్యాచ్​ల్లో 117 పరుగులు చేశాడు. ఒక్క అర్ధ శతకం మాత్రమే నమోదు చేశాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.