ETV Bharat / sports

'షీలా కీ జవానీ' పాటకు కుమార్తెతో వార్నర్ డ్యాన్స్ - కుమార్తె ఇండీతో వార్నర్

ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. పాపులర్ బాలీవుడ్ గీతానికి డ్యాన్స్ చేశాడు. ఇంట్లోనే కుమార్తె ఇండీతో కలిసి టిక్​టాక్ వీడియో చేసి, ఇన్​స్టాలో పంచుకున్నాడు.​

'షీలా కీ జవానీ' పాటకు కుమార్తెతో వార్నర్ డ్యాన్స్!
కుమార్తె ఇండీతో వార్నర్
author img

By

Published : Apr 18, 2020, 5:13 PM IST

ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన కుమార్తెతో కలిసి బాలీవుడ్‌ బ్లాక్​బస్టర్ పాటకు డ్యాన్స్‌ చేశాడు. బార్బీగర్ల్‌ కత్రినా కైఫ్‌ ఆడిపాడిన పాపులర్‌ గీతం 'షీలాకీ జవానీ'కి టిక్‌టాక్‌ చేశాడు. ఈ వీడియోను ఇన్‌స్టాలో‌ పంచుకున్నాడు. ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసిన తీరు నెటిజన్లను నవ్విస్తోంది.

'ఎవరైనా మాకు సాయం చేయండి. ప్లీజ్‌' అంటూ వీడియోకు వ్యాఖ్యను జోడించాడు వార్నర్‌. దీనిని 10 గంటల్లో 6 లక్షల మందికిపైగా వీక్షించారు.

'వావ్, క్యూట్, మీరిద్దరు కత్రినా కంటే బాగా డ్యాన్స్‌ చేస్తున్నారు, ఇంకా సాధన చేయాలి, అద్భుతం.. భారతీయులకు మీరంటే చాలా ఇష్టం వార్నర్‌' అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఆపై వార్నర్‌ ఇదే పాటకు మరోసారి టిక్‌టాక్‌ చేశాడు. ఫ్యాన్స్‌ కోసం మరో వీడియోను చేశానని, దయచేసి మాకెవరైనా డ్యాన్స్‌ నేర్పించండని రాసుకొచ్చాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు వార్నర్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.