ETV Bharat / sports

హైదరాబాద్​తోనే విలియమ్సన్.. వార్నర్ స్పష్టత - david warner Kane Williamson

విలియమ్సన్​ సన్​రైజర్స్​ను వీడనున్నాడంటూ వస్తున్న వార్తలపై వార్నర్​ స్పందించాడు. వచ్చే ఏడాది అతడు తమ జట్టుతోనే ఉంటాడని క్లారిటీ ఇచ్చాడు.

david warner confirms Kane Williamson not leaving Sunrisers Hyderabad
హైదరాబాద్​తోనే విలియమ్సన్.. వార్నర్ స్పష్టత
author img

By

Published : Dec 25, 2020, 10:06 AM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బ్యాట్స్‌మన్‌ కేన్‌ విలియమ్సన్‌ వచ్చే ఏడాది వేరే జట్టుకు వెళ్తాడనే ఊహాగానాలపై ఆ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పష్టత ఇచ్చాడు. విలియమ్సన్‌ ఎక్కడికీ పోడని చెప్పాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 13వ సీజన్‌ పూర్తి అయినప్పటి నుంచి విలియమ్సన్‌ హైదరాబాద్‌ టీమ్‌ను వీడిపోతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వార్నర్‌ సమాధానమిచ్చాడు. ఇది తాను మొదటిసారి వింటున్నానని, కేన్‌ ఎక్కడికీ పోడని వివరించాడు. దీంతో హైదరాబాద్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

dawid warner
హైదరాబాద్​ కెప్టెన్ డేవిడ్ వార్నర్

మరోవైపు హైదరాబాద్‌ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించి టాప్‌-3లో నిలిచింది. తుదిపోరుకు ముందు క్వాలిఫయర్‌-2లో దిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకుముందు విలియమ్సన్‌ గాయం కారణంగా సీజన్‌ ఆరంభంలో పలు మ్యాచ్‌లు ఆడలేదు. ఆపై జట్టులోకి వచ్చి కీలక సమయాల్లో రాణించాడు. ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన విలియమ్సన్‌.. 3 అర్ధశతకాలతో 317 పరుగులు చేశాడు. మరోవైపు వార్నర్‌ 16 మ్యాచ్‌ల్లో 4 అర్ధశతకాలతో 548 పరుగులు చేశాడు.

విలియమ్సన్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ ఆడుతుండగా, వార్నర్‌ టీమ్‌ఇండియాతో తలపడనున్నాడు. అతడిప్పుడు గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.