ETV Bharat / sports

చెపాక్​ స్టేడియం వద్ద టికెట్ల కోసం రచ్చ

సుమారు ఏడాది తర్వాత మైదానాల్లోకి ప్రేక్షకులు రానున్న వేళ చెన్నైలో తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇంగ్లాండ్​తో జరిగే రెండో టెస్టు కోసం టికెట్లు తీసుకోవడానికి చెపాక్ స్టేడియానికి అభిమానులు భారీగా వచ్చారు. దీంతో వారిని అదుపు చేయడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది.

author img

By

Published : Feb 11, 2021, 10:02 PM IST

Crowds throng Chepauk for tickets, ignore social distancing norms
చెపాక్​ వద్ద టికెట్ల రచ్చ.. అసహనంలో అభిమానులు

ఇంగ్లాండ్​తో జరిగే రెండో టెస్టు నుంచి మైదానాల్లోకి ప్రేక్షకులను అనుమతించనుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఫిబ్రవరి 13న (శనివారం) ఈ మ్యాచ్​ ప్రారంభంకానుంది. టికెట్ల కోసం చెన్నైలోని ఎంఏ చిదంబరం మైదానం వద్ద క్రికెట్ అభిమానులు గురువారం పెద్దఎత్తున బారులు తీరారు. కరోనా ఆంక్షలను లెక్కచేయకుండా గుమిగూడటం వల్ల చెపాక్​ వద్ద చాలా సేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.

'పొరబడ్డారు.. శనివారమూ ఇస్తాం'

రెండో టెస్టుకు 50శాతం వీక్షకులను అనుమతించింది తమిళనాడు క్రికెట్ సంఘం(టీఎన్​సీఏ). టికెట్లను ఆన్​లైన్​లోనే విక్రయించినా.. భౌతికరూపంలో వాటిని స్టేడియం వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. అభిమానులు ఒక్కసారిగా కిక్కిరిసిపోవడానికి గల కారణం అపార్థం చేసుకోవడమేనని టీఎన్​సీఏ చెప్పింది. తాము 11వ తేదీ నుంచి టికెట్లు ఇస్తాం అని చెబితే ఆ ఒక్క రోజు మాత్రమే ఇస్తారని వారు పొరబడినట్లు తెలిపింది. అయితే పోలీసులు, సిబ్బంది సహకారంతో పరిస్థితిని అదుపు చేసినట్లు వివరించింది. శుక్రవారం ఈ ప్రక్రియ సజావుగా సాగుతుందని చెప్పిన టీఎన్​సీఏ.. శనివారం కూడా టికెట్లు తీసుకొవచ్చని స్పష్టం చేసింది.

ట్విట్టర్​లో అభిమానుల వ్యంగ్యాస్త్రాలు..

టికెట్లు లభించిన ఆనందంలో కొందరు అభిమానలుంటే.. టికెట్ల జారీలో టీఎన్​సీఏ నిర్వహణాలోపం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేశారు. ట్విట్టర్​ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గంటల తరబడి క్యూలో నిలుచున్నా.. టికెట్లు అందలేదని పలువురు వాపోయారు.

ఇదీ చూడండి: భారత్​తో టీ20లకు ఇంగ్లాండ్ జట్టు ఇదే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.