ETV Bharat / sports

రొనాల్డో విజయాలు అసాధారణం: రోహిత్ - రొనాల్డో గురించి రోహిత్

ఫుట్​బాల్ స్టార్ రొనాల్డోపై ప్రశంసల జల్లు కురిపించాడు టీమ్​ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ. అతడు సాధించిన విజయాలు అసాధారణమైనవంటూ కితాబిచ్చాడు.

రోహిత్
రోహిత్
author img

By

Published : May 17, 2020, 6:36 PM IST

ఫుట్​బాల్ స్టార్ రొనాల్డోకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఎందరో ఆటగాళ్లు అతడిని స్ఫూర్తిగా తీసుకున్నారు. అలాంటి రొనాల్డోపై తాజాగా టీమ్​ఇండియా క్రికెటర్ రోహిత్ శర్మ ప్రశంసల జల్లు కురిపించాడు. ఫేస్​బుక్​లో బంగ్లాదేశ్​ ఆటగాడు తమీమ్ ఇక్బాల్​తో లైవ్​లో పాల్గొన్న హిట్​మ్యాన్​ ఈ పోర్చుగీస్ ఆటగాడి గురించి స్పందించాడు. అతడో కింగ్​ అంటూ కితాబిచ్చాడు.

"రొనాల్డోను ఎవరు ఇష్టపడరు? అతడో కింగ్. కెరీర్​లో అతడు సాధించిన విజయాలు అసాధారణమైనవి. అతడి విజయాలను ప్రశంసించకుండా ఉండలేం. ఓ సాధారణమైన వ్యక్తిగా వచ్చి ఇతంటి ఘనకీర్తి పొందడం అంత తేలిక కాదు. కష్ట సమయంలోనూ తోడుండి అతడి వెంటే నడిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు."

కరోనా లాక్​డౌన్ కారణంగా ప్రస్తుతం ఇంటివద్దే కుటుంబంతో గడుపుతున్నాడు రోహిత్. తరచుగా లైవ్​చాట్స్​లో పాల్గొంటూ పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.