టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య- నటాషా జోడీకి శభాకాంక్షలు చెప్పాడు అతడి అన్నయ్య కృనాల్ పాండ్య. ఇద్దరికీ అభినందనలు తెలుపుతూనే.. క్రేజీ ఫ్యామిలీలోకి స్వాగతం అని ట్వీట్ చేశాడు.
-
Big, big, congratulations @hardikpandya7 and Natasa ❤🤗 Natasa, we're so happy to have you join our crazy fam ❤ Welcome to the madness!! Love both of you guys 🤗 pic.twitter.com/iKFAbqyl42
— Krunal Pandya (@krunalpandya24) January 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Big, big, congratulations @hardikpandya7 and Natasa ❤🤗 Natasa, we're so happy to have you join our crazy fam ❤ Welcome to the madness!! Love both of you guys 🤗 pic.twitter.com/iKFAbqyl42
— Krunal Pandya (@krunalpandya24) January 2, 2020Big, big, congratulations @hardikpandya7 and Natasa ❤🤗 Natasa, we're so happy to have you join our crazy fam ❤ Welcome to the madness!! Love both of you guys 🤗 pic.twitter.com/iKFAbqyl42
— Krunal Pandya (@krunalpandya24) January 2, 2020
" బిగ్ బిగ్ కంగ్రాట్స్ హార్దిక్ పాండ్య-నటాషా. మా క్రేజీ ఫ్యామిలీతో నువ్వు(నటాషా) కలవడం చాలా సంతోషంగా ఉంది. వెల్‌కమ్ టు ద మ్యాడ్‌నెస్. లవ్ బోత్ ఆఫ్ యూ"
- కృనాల్ పాండ్య, క్రికెటర్
ఈ సందర్భంగా హార్దిక్, నటాషాతో కలిసున్న ఫోటోను పోస్టు చేశాడు కృనాల్. అంతకుముందు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ధోనీ భార్య సాక్షి, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, చాహల్, ఇషాన్ కిషన్ తదితరులు సోషల్ మీడియాలో పాండ్యకు శుభాకాంక్షలు చెప్పారు.
అభిమానులకు సర్ప్రైజ్
హార్దిక్ పాండ్య.. బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్‌తో ప్రేమ విషయం గురించి బయటపెట్టిన గంటల వ్యవధిలోనే నిశ్చితార్థం చేసుకొని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. నూతన సంవత్సరం రోజును ఇందుకు వేదికగా చేసుకున్నాడు. దుబాయ్ సముద్రంలోని స్పీడ్‌బోట్‌లో నటాషాను తీసుకెళ్లిన పాండ్య... మోకాళ్లపై కూర్చొని ఉంగరం తొడిగాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కొందరు శుభాకాంక్షలు చెప్పగా, మరికొందరు మాత్రం ఈజోడీపై విమర్శలు చేస్తూ ట్రోలింగ్ చేశారు. నటాషా చర్మ రంగుతో పాండ్యను పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై కొందరు నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. తాము పాండ్య అభిమానులం కాకపోయినా అతడు స్వశక్తితో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడని.. అలాంటప్పుడు నటాషా కన్నా పాండ్య ఏం తక్కువ అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, 2020లోకి అడుగుపెట్టినా ఇలాంటివి జరగడం దారణమని పేర్కొన్నారు.
రెండు సిరీస్‌ల్లో చోటు దక్కలే
ఈ మధ్య కాలంలో వెన్నుగాయంతో ఇబ్బందిపడిన హార్దిక్... ఇటీవలే శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అనంతరం కొంత విరామం తర్వాత కోలుకుని ప్రాక్టీసు ప్రారంభించాడు. ఇటీవల శ్రీలంక, ఆస్ట్రేలియాతో సిరీస్‌ల కోసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. ఇతడి స్థానంలో(ఆల్‌రౌండర్) శివమ్ దూబేను ఎంపిక చేశారు సెలక్టర్లు. న్యూజిలాండ్ పర్యటనలో ఇండియా-ఏ తరఫున మాత్రం బరిలోకి దిగనున్నాడు హార్దిక్. గతేడాది సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాపై తన చివరి అంతర్జాతీయ మ్యాచ్(టీ20) ఆడాడు.