ఇంగ్లాండ్ ప్రపంచకప్ హీరో, ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ మరో పురస్కారం గెల్చుకున్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్స్ అసోసియేషన్(పీసీఏ) నుంచి ఈ ఏడాది 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్'గా నిలిచి, అవార్డు అందుకున్నాడు. సిమన్ హర్మర్, ర్యాన్ హిగ్గిన్స్, డామ్ సిబ్లేలతో లాంటి వారితో స్టోక్స్ నామినేట్ అయినా.. చివరికి ఓటింగ్ ద్వారా అతడినే పురస్కారం వరించింది.
"ఈ అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ఆనందంతో మాటలు రావట్లేదు. ప్రపంచకప్ ఆడిన తర్వాత అందరూ నన్ను చాలా గొప్పగా చూస్తున్నారు. నా ప్రదర్శనకు పీసీఏ 'ప్లేయర్ ఆఫ్ ద అవార్డు' ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఓట్లు వేసి నన్ను ఎంపిక చేయడం వ్యక్తిగతంగా చాలా గౌరవంగా భావిస్తున్నా'. --బెన్‌స్టోక్స్, ఇంగ్లాండ్ క్రికెటర్
సోమర్సెట్స్కు చెందిన టామ్ బాంటన్‌కు 'యంగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు దక్కింది. ఇంగ్లాండ్‌కు చెందిన మహిళా క్రికెటర్ సోఫీ ఎక్లేస్టోన్‌కు 'ఉమన్ ప్లేయర్ ఆఫ్ ద సమ్మర్' పురస్కారం లభించింది.
ఇదే వేదికపై 'వన్డే ప్లేయర్ ఆఫ్ ద సమ్మర్' అవార్డును క్రిస్ వోక్స్ అందుకోగా...'టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద సమ్మర్'గా స్టువర్ట్ బ్రాడ్, 'కంట్రీ ఛాంపియన్షిప్ 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్'గా హర్మర్ నిలిచారు.
ఈ ఏడాది జులైలో న్యూజిలాండ్‌తో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో బెన్‌స్టోక్స్... ఇంగ్లాండ్ కప్పు సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల ముగిసిన యాషెస్ చివరి టెస్టులోనూ 135 పరుగులు చేసి ఓటమి అంచున ఉన్న మ్యాచ్‌ను గెలిపించాడు. ఈ సిరీస్ డ్రా అయింది.
ఇది చదవండి: సఫారీలపై రోహిత్- మయాంక్ రికార్డు భాగస్వామ్యం