ETV Bharat / sports

ఆ విషయంపై ఐసీసీకి దక్షిణాఫ్రికా బోర్డ్​ లేఖ - cricket australia

అల్పాాదాయ క్రికెట్​ బోర్డులను ప్రస్తావిస్తూ ఐసీసీకి ఓ లేఖ రాసింది దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు. ఇటీవల తమ దేశ పర్యటనను రద్దు చేసుకున్న ఆస్ట్రేలియా గురించి కూడా ఈ లేఖలో పేర్కొంది.

Cricket South Africa Asks ICC To Intervene After Australia Call Off South Africa Tour
ఐసీసీకి.. దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు లేఖ
author img

By

Published : Feb 9, 2021, 12:21 PM IST

దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు.. అంతర్జాతీయ క్రికెట్​ నియంత్రణ మండలి(ఐసీసీ)కి ఓ లేఖ రాసింది. ప్రణాళిక ప్రకారం సిరీస్​లు జరగనప్పుడు.. తక్కువ సంపన్న క్రికెట్​ బోర్డుల ఆర్థిక నష్టాలను పరిగణలోకి తీసుకోవాలని కోరింది. కరోనా నేపథ్యంలో ఇటీవల సౌతాఫ్రికా పర్యటనను వాయిదా వేసుకున్న క్రికెట్​ ఆస్ట్రేలియా గురించి ఇందులో ప్రస్తావించింది.

ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా దక్షిణాఫ్రికాలో ఆస్ట్రేలియా మూడు టెస్టుల సిరీస్​ను ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్​ ఆడేందుకు క్రికెట్​ ఆస్ట్రేలియా విముఖత చూపింది.

"ఈ పర్యటనను రద్దు చేసుకున్న ఆసీస్​.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది" అని లేఖలో దక్షిణాఫ్రికా పేర్కొంది. ఆసీస్​ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అల్పాదాయ క్రికెట్​ బోర్డులపై చాలా ప్రభావం పడిందని సౌతాఫ్రికా బోర్డు తెలిపింది.

దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని ఈఎస్​పీఎన్​ క్రిక్​ ఇన్ఫో పేర్కొంది. కానీ మ్యాచ్​ ప్రణాళికల విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిందిగా లేఖ ద్వారా తన అభిప్రాయాన్ని కోరిందని వెల్లడించింది.

ఈ విషయంపై గతంలో క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్​ హక్లీ చేసిన వ్యాఖ్యలను ఈఎస్​పీఎన్​ క్రిక్​ ఇన్ఫో ఉటంకించింది. "దక్షిణాఫ్రికాలో పరిస్థితులు బాగోలేవు. ఈ పర్యటన కోసం మేము చేయాల్సిందంతా చేశాం కానీ అధిక మంది వైద్యుల సూచన మేరకు ఈ సిరీస్​ను వాయిదా వేయాల్సి వచ్చింది" అని హక్లీ పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా నిర్ణయం వల్ల ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్స్​లోకి న్యూజిలాండ్​ అధికారికంగా వెళ్లింది. తదుపరి స్థానం కోసం ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ల మధ్య పోటీ నెలకొంది.

ఇదీ చదవండి: 'కెప్టెన్సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.