ఆస్ట్రేలియా సిరీస్‌కు ప్రకటించిన భారత జట్టులో చోటు సంపాదించలేకపోయిన ముంబయి ఇండియన్స్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌కు విదేశీ ఆటగాళ్ల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. అతడిని టీమ్ ఇండియాకు ఎంపిక చేయాల్సిందని ఇప్పటికే పలువురు భారత క్రికెట్ దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. తాజాగా.. న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్, క్రికెట్ వ్యాఖ్యాత స్కాట్ స్టైరిస్ స్పందించాడు. "సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలనుకుంటే న్యూజిలాండ్‌కు వచ్చి జాతీయ జట్టులో ఆడవచ్చు" అని స్టైరిస్ అన్నాడు.
అంతేకాదు.. కోహ్లీ జట్టును ఇష్టపడకపోవడానికి గల కారణాలను కూడా స్టైరిస్ వెల్లడించాడు. "మీకు ఇష్టం లేని జట్లలో బెంగళూరు ఎందుకు అగ్రస్థానంలో ఉంటుంది?" అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. "ఎందుకంటే.. ఉన్న జట్లలో అన్నింటినీ మనం ఇష్టపడలేం. ఏదో ఒక జట్టును ద్వేషించాలి కాబట్టి" అని సమాధానం ఇచ్చాడు.
బుధవారం రాత్రి బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత ఇన్నింగ్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన ముంబయి ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్‌పై పలువురు విదేశీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు.
పలువురి ప్రశంసలు
'సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నన్ను ఎప్పుడు అడిగినా ఇదే సమాధానం చెప్తా' అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని అన్నాడు.
'ఈ ఆకాశానికి హద్దుల్లేవు' అంటూ సూర్యకుమార్ యాదవ్‌ను ఉద్దేశిస్తూ భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ట్వీట్ చేశాడు.
'సూర్యకుమార్ ఆస్ట్రేలియా విమానం ఎక్కాల్సిన వాడు' అని ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఇదీ చదవండి:రాజస్థాన్ X పంజాబ్: ఆశలు దక్కేదెవరికి?