ETV Bharat / sports

'సిరీస్ ఓడినా.. మా లక్ష్యం ప్రపంచకప్'​

author img

By

Published : Mar 23, 2021, 8:22 AM IST

టీమ్ఇండియాతో వన్డే సిరీస్​లో సత్తాచాటితే టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకోవచ్చని యువ ఆటగాళ్లకు సూచించాడు ఇంగ్లాండ్ సారథి ఇయాన్ మోర్గాన్. టీ20, 50 ఓవర్ల ఫార్మాట్​లో పరిస్థితులు దాదాపు ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నాడు.

Morgan
మోర్గాన్

టీ20 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యేందుకు ఆటగాళ్లకు టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌ మంచి అవకాశమని ఇంగ్లాండ్‌ సారథి ఇయాన్‌ మోర్గాన్‌ అన్నాడు. టీ20 క్రికెట్‌, 50 ఓవర్ల ఫార్మాట్లో పరిస్థితులు దాదాపు ఒకే రకంగా ఉంటాయని పేర్కొన్నాడు. టీమ్‌ఇండియాతో మూడో వన్డేకు ముందు అతడు మీడియాతో మాట్లాడాడు.

"టీ20 ప్రపంచకప్‌ ముందర్లో ఉంది. ఇప్పటివరకు తుది జట్టులోకి ఎంపికవ్వని వాళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడటం గొప్ప అవకాశం. విదేశాల్లో పరుగులు చేసి వికెట్లు తీస్తే వాళ్లు టీ20 జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉంటుంది. ఒకే వేదికలో పటిష్ఠమైన జట్టుతో తలపడటం ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు 50 ఓవర్ల వైఖరికి అలవాటు పడటం ముఖ్యం. వన్డే, టీ20 క్రికెట్‌ పరిస్థితులు ఒకేలా ఉంటాయి. జట్లలోనూ పెద్దగా మార్పులుండవు. రెండు జట్ల నైపుణ్యాలు ఒకేలా ఉంటాయి."

-మోర్గాన్, ఇంగ్లాండ్ సారథి

"ఇక్కడి పరిస్థితులు మాకు కొత్తే. భారత్‌ వంటి దేశాల్లో ఆడేటప్పుడు సౌకర్యవంతమైన జోన్‌ నుంచి బయటపడొచ్చు. పొరపాట్ల నుంచి నేర్చుకోవచ్చు. టీ20 సిరీసు గెలవకపోయినా ఫర్వాలేదు. ఇప్పటి వరకు మా పర్యటన బాగా సాగింది. ఎందుకంటే మా లక్ష్యం ప్రపంచకప్‌. మెగాటోర్నీ గెలవాలంటే వరుసగా ప్రతి సిరీసూ గెలవాల్సిన అవసరం లేదు. పరిస్థితుల వల్లే మొయిన్‌ అలీకి చోటు దక్కలేదు. మేం ఆడిన పిచ్‌లపై ఫింగర్‌ స్పిన్నర్లకు అనుకూలత లేదు. ఏదేమైనా ఆల్‌రౌండర్లు ఉండటం జట్టుకు గొప్ప విలువ. వన్డేల్లో రూట్‌ లేకపోవడం మాత్రం కాస్త ఇబ్బందికరమే" అని మోర్గాన్‌ తెలిపాడు.

ఇవీ చూడండి: 'మైదానంలో ఆటగాళ్ల మధ్య విభేదాలు సాధారణమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.