టీ20 ఫార్మాట్లో భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కొత్త ఫీట్ సాధించాడు. పొట్టి ఫార్మాట్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా 59 వికెట్లతో అతడి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో జాస్ బట్లర్ వికెట్ తీయడం ద్వారా.. చాహల్ ఈ రికార్డు అందుకున్నాడు. టీ20ల్లో 49 మ్యాచ్‌లాడిన బుమ్రా 59 వికెట్లు తీసుకోగా.. 46 మ్యాచ్‌ల్లో 60 వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు ఈ మణికట్టు స్పిన్నర్.
మొదటి టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత ఓవర్లలో కేవలం 124 పరుగులే చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లాండ్ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మోర్గాన్ సేన 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తదుపరి మ్యాచ్ మార్చి 14న జరగనుంది.
ఇదీ చదవండి: 'ఫైనల్లో సహజంగా ఆడండి.. ఎలాంటి మార్పులు చేయొద్దు'