ETV Bharat / sports

రహానె క్రికెటరా... సెక్యూరిటీ గార్డా...? - రహానె ఆటతీరుపై విమర్శలు చేశాడు మాజీ క్రికెటర్​ సందీప్​ పాటిల్​

న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు ​సిరీస్​లో టీమిండియా వైస్​ కెప్టెన్​ అజింక్యా రహానె ఆటతీరుపై విమర్శలు చేశాడు మాజీ క్రికెటర్​ సందీప్​ పాటిల్​. అతడిని సెక్యూరిటీ గార్డ్​లా అభివర్ణించాడు.

rahane
రహానె
author img

By

Published : Mar 6, 2020, 10:27 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో 0-2 తేడాతో టీమిండియా ఘోర పరాజయం చెందింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై పలు విమర్శలు గుప్పుమన్నాయి. తాజాగా వైస్​ కెప్టెన్​ అజింక్యా రహానె ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు మాజీ టీమిండియా సెలక్టర్​ సందీప్​ పాటిల్​. ఈ సిరీస్​లో రహానె నాలుగు ఇన్నింగ్స్​లో కేవలం 91 పరుగులే చేశాడు.

రహానె పేలవమైన బ్యాటింగ్​ చేశాడని అన్నాడు పాటిల్​. తనని తాను టెస్టు స్పెషలిస్టుగా నిరూపించుకోవడానికి ప్రయత్నించాడని ఆరోపించాడు. ఎక్కడ ఔట్ అవుతానో అనే భయంతో కనీసం పరుగులు కూడా సరిగ్గా తీయకుండా క్రీజులోపలే ఉండి తడబడుతూ ఆడాడని తెలిపాడు. బ్యాట్స్​మెన్​ క్రీజుకే అతుక్కుపోతే పరుగులు ఎవరు సాధిస్తారని ప్రశ్నించాడు. బ్యాట్స్​మెన్​ క్రీజులో ఉండి ఆడాలనుకుంటే అతడిని సెక్యూరిటీ గార్డ్​గా పిలవాలని అన్నాడు.

"గతంలో రహానె ముంబయి తరపున ఆడేటప్పుడు అతడి బ్యాటింగ్​ పేలవంగా ఉందని విన్నాను. అతడి భయమే అతడి ఓటమికి కారణమవుతోంది. రహానేకు విదేశాల్లో మంచి రికార్డుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు అతడు పరిమిత ఓవర్లలో రాణించలేకపోతున్నాడు. అందుకని కనీసం టెస్టుల్లోనైనా రాణించాలని ప్రయత్నిస్తున్నాడు."

-సందీప్​ పాటిల్​, మాజీ క్రికెటర్​.

టీమిండియా కోచ్​పై విమర్శలు

టీమిండియా కోచ్​ రవిశాస్త్రి, బ్యాటింగ్​ కోచ్ విక్రమ్​ రాథోర్​నూ విమర్శించాడు పాటిల్​. రహానెను ఆటను మెరుగుపరుచుకునేలా వారు ప్రేరేపించాలని సూచించాడు.

ఇదీ చూడండి : రిక్షా ఎక్కేందుకైనా డబ్బులు ఉండేవి కావు : రహానె

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.