ఈసారి సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహించే ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా నిలుస్తాడని ఆస్ట్రేలియా మాజీ లెగ్‌స్పిన్నర్ బ్రాడ్‌హాగ్ అన్నాడు. చాలా రోజుల నుంచి పాండ్య క్రికెట్‌కు దూరమయ్యాడని, అలాగే త్వరలో తండ్రి కాబోతున్నాడని చెప్పాడు. ఆ రెండు కారణాలతో ముంబయి ఆల్‌రౌండర్ అదనపు శక్తి పొందుతాడని, తద్వారా 'మ్యాన్ ఆఫ్ ది సిరీస్'గా ఎంపిక అవుతాడని హాగ్ అభిప్రాయపడ్డాడు.
ముంబయి జట్టు తొలి నలుగురు మంచి ఆటగాళ్లు అని, తర్వాత వచ్చే ఆటగాళ్లు కూడా అత్యుత్తమ ఆల్‌రౌండర్లని చెప్పాడు హాగ్. అలాగే వారికి అద్భుతమైన బౌలింగ్ విభాగం ఉందన్నాడు. ఇక డెత్ ఓవర్లలో జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ లాంటి మేటి పేసర్లున్నారని గుర్తుచేశాడు. అనంతరం ధోనీ గురించి మాట్లాడిన బ్రాడ్.. అతడో అద్భుతమైన ఆటగాడని, భయం లేకుండా ఆడతాడని పేర్కొన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అతడిని ఎవరూ రీప్లేస్ చేయలేరని వ్యాఖ్యానించాడు.