ETV Bharat / sports

ఈ దశాబ్దపు ప్రపంచ మేటి వన్డే బౌలర్లు వీరే..!

author img

By

Published : Dec 15, 2019, 6:27 AM IST

క్రికెట్.. బ్యాట్స్​మెన్ గేమ్​ అని కొంతమంది విమర్శలు చేసినప్పటికీ.. పదునైన బౌలింగ్​తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు బౌలర్లు. ఈ దశాబ్దంలో అత్యద్భుతంగా ఆకట్టుకున్న టాప్-10 బౌలర్ల గురించి ఇప్పుడు చూద్దాం.

best bowlers in this decade
ఈ దశాబ్దపు ప్రపంచ మేటి వన్డే బౌలర్లు వీరే.. !

క్రికెట్.. జెంటిల్మన్ గేమ్ ఒకప్పుడు బ్యాట్స్​మెన్​కు దీటుగా బౌలర్లు కూడా చెలరేగేవాళ్లు. ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తూ.. పిచ్​పై నిప్పులు చెరిగేవాళ్లు. క్రమేణా పవర్ ప్లే నిబంధనలు, ఫీల్డింగ్ ప్రతిబంధకాలతో క్రికెట్​ బ్యాట్స్​మెన్​కు స్వర్గాధామంగా మారింది. గతంతో పోలిస్తే బౌలర్ల ప్రభావం కొద్దిగా తగ్గినప్పటికీ ఈ దశాబ్దంలోనూ తమ పదునైన బౌలింగ్​తో ఆకట్టుకుంటున్నారు కొంతమంది బౌలర్లు. పాయింట్ల వారిగా వారిపై ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

మిచెల్ స్టార్క్​.. 9.5/10

ప్రస్తుత తరంలో అత్యుత్తమ వన్డే బౌలర్లలో ముందువరుసలో ఉన్నాడు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. ఈ దశకంలో 172 వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. ముఖ్యంగా కొత్త బంతితో పదునైన పేస్​తో పాటు స్వింగ్​ కూడా రాబడుతూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. డెత్ ఓవర్లలో అతడు వేసే యార్కర్లకు బ్యాట్స్​మెన్ చేతులేత్తెస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. 2015, 2019 ప్రపంచకప్​ల్లో ఆస్ట్రేలియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2015 మెగాటోర్నీలో అత్యధిక వికెట్లతో(22) మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కించుకున్నాడు.

best bowlers in this decade
మిచెల్ స్టార్క్​

లసిత్ మలింగ.. 9/10

ఈ దశాబ్దంలో లీడింగ్ వికెట్ టేకర్​గా గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ. 2010 జనవరి నుంచి 162 వన్డేల్లో 248 వికెట్లు తీసి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. 5 కంటే ఎక్కువ వికెట్లు 8 సార్లు తీసి ఎవరికి దక్కని ఘనత సాధించాడు మలింగ. ఈ కారణంగా అతడు ఈ దశాబ్దపు మేటి బౌలర్ల జాబితాలో చేరాడు. అయితే పదే పదే గాయాల బారిన పడడం, ఫిట్​నెస్​లేమితో రెండో స్థానానికే పరిమితమయ్యాడు.

best bowlers in this decade
లసిత్ మలింగ

ట్రెంట్ బౌల్ట్​.. 9/10

ఆసీస్​ జట్టులో స్టార్క్ ఎలాగో.. న్యూజిలాండ్​కు ట్రెంట్ బౌల్ట్​ ఆ రకంగా ఆకట్టుకుంటున్నాడు. 2012లో వన్డేల్లో అరంగేట్రం చేసిన బౌల్ట్.. 165 వన్డేల్లో 25 సగటుతో 164 వికెట్లు తీశాడు. ప్రతి 5 ఓవర్లకు ఓ వికెట్ చొప్పున తీస్తూ వన్డే క్రికెట్లో చక్కటి ప్రదర్శన చేస్తున్నాడు. 2015 ప్రపంచకప్​లో కివీస్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ రపోషించాడు బౌల్ట్. అంతేకాకుండా ఈ దశాబ్దంలో న్యూజిలాండ్ మెరుగైన స్థితిలో నిలవడంలో ఇతడి పాత్ర ఎంతో ఉంది.

best bowlers in this decade
బౌల్ట్​

జస్ప్రీత్ బుమ్రా.. 8.5/10

ఈ దశాబ్దం రెండో అర్ధభాగంలో అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అరంగేట్రం చేసి.. అనతికాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బౌలర్ జస్ప్రీత్ బుమ్రా. 2016లో తొలి వన్డే ఆడిన ఇతడు ఫార్మాట్​ ఏదైనా.. ప్రదర్శనలో ఏమాత్రం తడబాటు లేకుండా సత్తాచాటుతున్నాడు. కేవలం 58 వన్డేలాడిన ఈ గుజరాత్ పేసర్ 21.88 సగటుతో 103 వికెట్లు తీశాడు. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్​గా రికార్డు సృష్టించాడు. ఓవర్​కు 4.49 పరుగులు ఇస్తూ.. ప్రతి 29 బంతులకో వికెట్ తీస్తున్నాడు.

best bowlers in this decade
బుమ్రా

రషీద్ ఖాన్​.. 8.5/10

బుమ్రా తర్వాత ఈ దశాబ్దం రెండో అర్ధభాగంలో అరంగేట్రం చేసిన మరో బౌలర్ అఫ్గనిస్థాన్​ స్పిన్నర్ రషీద్ ఖాన్. తెలుపు బంతి క్రికెట్​లో అత్యుత్తమ సగటుతో చరిత్ర సృష్టించాడు రషీద్. 18.54 సగటుతో 133 వికెట్లు తీసి ఎవరికి దక్కని ఘనత సొంతం చేసుకున్నాడు. కొనేళ్లుగా అఫ్గానిస్థాన్ విజయాలతో దూసుకెళ్తోందంటే అందుకు రషీదే కారణం. టీ20ల్లో ఈ లెగ్ స్పిన్నర్ పిచ్ ఎలాంటిదైనా రెండు వైపులా బంతిని టర్న్ చేస్తూ బ్యాట్స్​మెన్​ను ఇబ్బంది పెడుతుంటాడు.

best bowlers in this decade
రషీద్ ఖాన్​

డేల్ స్టెయిన్​.. 7.5/10

ఈ దశకం తొలి అర్ధభాగంలో ప్రపంచ మేటి బౌలర్లలో ముందువరుసలో ఉన్న స్టెయిన్.. 2015 ప్రపంచకప్ తర్వాత వెనకంజ వేశాడు. 90 వన్డేల్లో 24.80 సగటుతో 145 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశాడు. ఇందులో 111 వికెట్లు 69 మ్యాచ్​ల్లోనే దక్కించుకున్నాడు. మ్యాచ్​కు కనీసం రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంటూ అత్యుత్తమ పేసర్​గా ఎదిగాడు. అయితే 2015 మెగాటోర్నీ తర్వాత ఫిట్​నెస్ లేమి, తరచూ గాయాల పాలవ్వడం లాంటి సమస్యలతో బౌలింగ్​లో మునుపటి పదును తగ్గింది.

best bowlers in this decade
డేల్ స్టెయిన్​

ఇమ్రాన్ తాహిర్.. 8/10

ప్రపంచంలోనే అత్యుత్తమ లెగ్ స్పిన్నర్​గా పేరు తెచ్చుకున్నాడు దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహిర్. ఈ దశాబ్దంలో 173 వికెట్లు తీసి క్రికెట్ ప్రేమికుల దృష్టి ఆకర్షించాడు. మిడిల్ ఓవర్లలో పదే పదే వికెట్లు తీస్తూ బ్యాట్స్​మెన్​ను ఇబ్బందికి గురి చేస్తుంటాడు. కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్​లో నిలకడగా బౌలింగ్ చేస్తూ.. ఆకట్టుకున్నాడు. 2019 ప్రపంచకప్ అనంతరం వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలికాడు తాహిర్. అయితే టీ20ల్లో ఆడుతున్నాడు.

best bowlers in this decade
ఇమ్రాన్ తాహిర్

మహ్మద్ షమీ.. 7.5/10

బుమ్రా తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న భారత బౌలర్ మహ్మద్ షమీ. జహీర్​ ఖాన్ తర్వాత అతడి స్థానాన్ని భర్తీ చేస్తూ.. జట్టులోకి వచ్చిన ఈ బంగాల్ బౌలర్ వన్డే క్రికెట్​లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. 2013 జనవరిలో అరంగేట్రం చేసిన ఇతడు 24.71 సగటుతో 131 వికెట్లు తీశాడు. పరుగులు సమర్పిస్తాడు అనే పేరు ఉన్నప్పటికీ నిలకడగా వికెట్లు తీస్తూ జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. 2015, 2019 ప్రపంచకప్​ల్లో మెరుగ్గా రాణించాడు.

best bowlers in this decade
మహ్మద్ షమీ

సయిద్ అజ్మల్.. 7/10

ఈ దశాబ్దం తొలి అర్ధభాగంలో అద్భుతంగా సత్తాచాటాడు పాక్ స్పిన్నర్ అజ్మల్. 2009లో వన్డేల్లో అరంగేట్రం చేసిన అజ్మల్.. ఐదేళ్ల పాటు అంతర్జాతీయ మ్యాచ్​ల్లో అదరగొట్టాడు. 91 మ్యాచ్​ల్లో 21.90 సగటుతో 151 వికెట్లు తీశాడు. 4.24 ఎకానమీ రేటుతో ఈ ప్రదర్శన చేయడం విశేషం. అయితే 2014లో అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్​తో ఐసీసీ నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. అనంతరం శైలి మార్చుకుని పునరాగానం చేసినా ఇంతకుముందున్న పదును లోపించింది. చివరకు 2015లో జాతీయ జట్టుకు దూరమయ్యాడు.

best bowlers in this decade
సయిద్ అజ్మల్

షకిబుల్ హసన్.. 7/10

ప్రపంచంలో అత్యుత్తమ ఆల్​రౌండర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్ షకిబుల్​.. బౌలింగ్​లోనూ మంచి గణాంకాలు నమోదు చేశాడు. లెఫ్టార్మ్​ స్పిన్నర్​గా మెరుగ్గా రాణించాడు. ఈ దశాబ్దంలో 131 వన్డేల్లో 30.15 సగటుతో 177 వికెట్లు తీశాడు. 4.72 ఎకానమీతో వికెట్లు తీయడమే కాదు పొదుపుగా బౌలింగ్ చేస్తూ.. బంగ్లా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

best bowlers in this decade
షకిబుల్

ఇదీ చదవండి: మా దృష్టంతా విదేశీయులపైనే: పాంటింగ్

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Makuhari Messe, Chiba, Japan - 14th December 2019
  
Round of 64, (16) Ryan Choi Chun-yin (HKG) v (49) Maxine Pauty (FRA)
1. 00:00 Ryan Choi Chun-yin steps onto piste
2. 00:14 various of individual foil round of 64 match
3. 00:33 Maxine Pauty scores to win 15-5 (winning point confirmed by video replay)    
4. 01:01 SOUNDBITE (English): Ryan Choi Chun-yin:
(on his defeat to Maxine Pauty in the Round of 64)
"I think he didn't surprise me, I surprised myself with a very bad performance. I don't know what I was doing. I was like dreaming for the whole match."
5. 01:15 SOUNDBITE (Cantonese): Ryan Choi Chun-yin:
(on his defeat to Maxine Pauty in the Round of 64)
"I think I played very poorly, very poorly. It was almost like I didn't know what I was doing out there. Of course my opponent was good as well, but that wasn't the reason I lost. I basically lost to myself."
Round of 64, (6) Cheung Ka-long (HKG) v (59) Toshiya Saito (JPN)
6. 01:42 Cheung Ka-long and Toshiya Saito on piste before Round of 64
7. 01:53 Various of individual foil round of 64 match
8. 02:15 Toshiya Saito winning point for 15-12 victory   
9. 02:31 SOUNDBITE (English): Cheung Ka-long:
(saying both he and teammate Ryan Choi are focusing on Sunday's team event after suffering surprise defeats in the individual Round of 64)
"I think it's not a big deal for me, for us to lose in the individual. For me it's separate. Team is another event, so yeah. I will try my best to fence."
10. 02:47 SOUNDBITE (Cantonese): Cheung Ka-long:
(on his upset Round of 64 defeat to 59th seed Toshiya Saito)
"I didn't play so well today. Next time I will work harder and do better. But today when I took on Saito, I just didn't get the job done."
11. 03:08 Cheung speaking to reporter
SOURCE: SNTV
DURATION: 03:12
STORYLINE:
  
Hong Kong Fencing stars Cheung Ka-long and Ryan Choi both suffered surprise defeats in the Individual Foil Round of 64 at the World Cup 2020 Olympic test event in Chiba, Japan on Saturday.
    
Number sixteen seed Choi was beaten 15-5 by 49th seeded Maxine Pauty of France.
   
Choi, who won team foil silver with Hong Kong at the 2018 Asian Games, said a lack of focus was the main reason for his defeat.
The number six seed Cheung Ka-long then lost 15-12 to Toshiya Saito of Japan - the 59th seed - to end the individual hopes for both Hong Kong fencers.
Cheung, the individual foil bronze and team silver winner at the 2018 Asian Games, said he was disappointed but would shift his attention to Sunday's team competition.
The Individual Foil final is scheduled for later on Saturday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.