ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ సాధించడమంటే.. టీ20, వన్డే ప్రపంచకప్‌లు గెలవడం కన్నా గొప్ప విషయమని అంటున్నాడు టీమిండియా క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా. క్రికెట్‌లో టెస్టు ఫార్మాటే అసలైన ఆట అని తెలిపాడు.
"టెస్టు ఛాంపియన్‌గా అవతరించడానికి మించింది ఏదీ లేదు, టెస్టు క్రికెటే అసలైన ఆట. పాతతరం ఆటగాళ్లలో ఏ గొప్ప క్రికెటర్‌ను అడిగినా ఇదే విషయం చెబుతారు. ప్రస్తుత ఆటగాళ్లను అడిగినా టెస్టు క్రికెటే నాణ్యమైన ఆటని చెబుతారు. అయితే, మెజారిటీ జట్లు స్వదేశంలో బాగా ఆడుతున్నా, విదేశాలకు వెళ్లినప్పుడే వారికి అసలైన సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా టీమిండియాకు విదేశాల్లో కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి, అయినా అక్కడ విజయాలు సాధించింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరే ఏ రెండు జట్లైనా రెండేళ్ల పాటు శ్రమించాలి. ఇంటా, బయటా కష్టపడి గెలవాలి."
-పుజారా, టీమిండియా క్రికెటర్
టెస్టు క్రికెట్‌పై ఆదరణ తగ్గిపోతున్న వేళ ఐసీసీ ఇలాంటి ఛాంపియన్‌షిప్‌ను తీసుకురావడం బాగుందని కితాబిచ్చాడు పుజారా. టెస్టు హోదా కలిగిన జట్లు ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరాడు.
"టెస్టు క్రికెట్‌ను కొనసాగించడానికి ఛాంపియన్‌షిప్ సరైంది. డ్రా చేసుకోవాలనే ఉద్దేశం కలిగిన జట్లు కూడా ఈ టోర్నీ వల్ల లాభపడతాయి. ఏ జట్టుకైనా మ్యాచ్‌లు గెలిస్తే ఎక్కువ పాయింట్లు వస్తాయి. ఒకవేళ డ్రాగా ముగించుకున్నా కొన్ని పాయింట్లు దక్కుతాయి. టెస్టు ఛాంపియన్‌షిప్ వల్ల ఈ ఆటలో పోటీతత్వం పెరుగుతుంది. దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
-పుజారా, టీమిండియా క్రికెటర్
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలైనప్పటి నుంచి భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లపై సిరీస్ విజయాలతో 360 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా 296 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.