ఐపీఎల్ 13వ సీజన్లో మ్యాచ్ ఫిక్సింగ్ జరగకుండా కఠినమైన భద్రతా చర్యలు తీసుకుంటోంది బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ). త్వరలో ప్రారంభంకానున్న ఈ మెగాలీగ్పై గట్టి నిఘా పెట్టనుంది. ఈ మేరకు యూకేకు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ర్యాడర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్లో బెట్టింగ్, ఇతర అవినీతి కార్యకలాపాలను అరిక్టటడానికి సదరు కంపెనీ సేవలను(ఫ్రాడ్ డిటెక్షన్ సర్వీసెస్) ఉపయోగించుకోనున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.
ఇప్పటికే స్పోర్ట్స్ర్యాడర్ సేవలను ప్రపంచవ్యాప్తంగా ఫిఫా, యుఈఎఫ్ఏ సహా పలు లీగుల్లో వినియోగిస్తున్నారు.
భారత మహిళా క్రికెట్ జట్టుతో పాటు తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్‌పీఎల్)లో గతేడాది ఫిక్సింగ్ కలకలం రేగింది. అప్పటినుంచి క్రికెటర్లు సహా పలువురు సిబ్బందిపై గట్టి నిఘా పెట్టింది భారత క్రికెట్ బోర్డు.
దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10వరకు బయోసెక్యూర్ వాతావరణంలో.. ఐపీఎల్ జరగనుంది. తొలి మ్యాచ్లో.. ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు, రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబయి ఇండియన్స్ తలపడనున్నాయి.