ETV Bharat / sports

'ఐపీఎల్​ అప్పటివరకు నిర్వహించడం సాధ్యం కాదు' - బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ తాజా వార్తలు

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ... తన పదవీ కాలం గురించి స్పందించాడు. ఐపీఎల్‌ కోసం మాట్లాడుతూ.. వచ్చే నెల మధ్య వరకూ టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని చెప్పాడు.

BCCI President  Sourabh Gangouli  responds on his tenure
అది మా చేతుల్లో లేదు
author img

By

Published : Apr 14, 2020, 9:48 AM IST

బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం సౌరభ్‌ గంగూలీ అధ్యక్షుడిగా కొనసాగాల్సింది తొమ్మిది నెలలే. నిబంధనల ప్రకారం వరుసగా ఆరేళ్ల పాటు ఏదైనా రాష్ట్ర క్రికెట్‌ సంఘంలో కానీ లేదా బీసీసీఐలో కానీ లేదా రెండింట్లో కలిపి కానీ పదవిలో ఉన్న వ్యక్తి కచ్చితంగా మూడేళ్ల పాటు విరామం తీసుకోవాల్సిందే. ఇదివరకే బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) సంయుక్త కార్యదర్శిగా, అధ్యక్షుడిగా కలిపి అయిదేళ్ల మూడు నెలలు పనిచేసిన అతడు.. బీసీసీఐ సారథిగా ఇప్పటికే ఆరు నెలలు పూర్తి చేసుకున్నాడు. అతను కొనసాగడానికి వీలున్నది ఇంకో మూడు నెలలే.

అయితే పదవీ కాలం విషయంపై రాజ్యాంగాన్ని సవరించాల్సిందిగా కోరుతూ గంగూలీ బృందం కోర్టును ఇటీవలే ఆశ్రయించింది. దీనిపై సౌరభ్‌ తాజాగా స్పందిస్తూ.. "ప్రస్తుతం కోర్టులు పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు. కనుక ఆ విషయంపై ఎలాంటి తాజా సమాచారం లేదు. అయినా ఏం జరిగేది ఉంటే అదే జరుగుతుంది. అది మా చేతుల్లో లేదు" అని పేర్కొన్నాడు. ఐపీఎల్‌ గురించి స్పందిస్తూ.. వచ్చే నెల మధ్య వరకూ ఆ టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని సౌరభ్‌ తెలిపాడు.

ఇదీ చూడండి : పాంచ్​ పటాకా: ఐపీఎల్ చరిత్రలో థ్రిల్లింగ్ 'సూపర్ ఓవర్​'లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.