బయోబబుల్‌లో దీర్ఘకాలం ఉంటూ క్రికెట్ ఆడటం కష్టమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఐపీఎల్‌ను విజయవంతం చేసిన ఆటగాళ్లకు అతను కృతజ్ఞతలు చెప్పాడు.
"బీసీసీఐ తరఫున ప్రతి ఐపీఎల్ జట్టులోని ఆటగాళ్లకూ ధన్యవాదాలు. బబుల్‌లో ఉంటూ క్రికెట్ ఆడటం మానసికంగా సవాలు విసురుతుంది. ఈ పరిస్థితుల్లో అందరూ గొప్ప నిబద్ధత చూపించారు."
-- సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.
కరోనా కారణంగా యూఏఈలో నిర్వహించిన ఐపీఎల్లో పాల్గొన్న టీమ్ఇండియా.. ఆస్ట్రేలియా పర్యటన కోసం బయలుదేరనుంది. అక్కడే క్వారంటైన్లో ఉంటూ ప్రాక్టీస్ చేయనుంది.
ఇదీ చూడండి:బుడగలో మళ్లీ ఉండాలంటే కష్టమే: కోహ్లీ