ETV Bharat / sports

దేశవాళీ క్రికెట్​ షెడ్యూల్​ బ్లూ ప్రింట్​ ఇదే! - రంజీట్రోఫీ

దేశవాళీ క్రికెట్​ను పునః ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది బీసీసీఐ.​ ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్​ షెడ్యూల్​ను ఆయా రాష్ట్ర సంఘాలకు పంపింది. ఇందులో పాల్గొనే 38 జట్ల కోసం దేశవ్యాప్తంగా ఆరు బయో బుడగలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేసింది.

ganguly
గంగూలీ
author img

By

Published : Nov 30, 2020, 5:46 AM IST

కరోనా వల్ల ఆగిపోయిన క్రికెట్ కార్యకలాపాలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఇప్పటికే ఐపీఎల్​తో మంచి జోష్​ రాగా.. ఇదే క్రమంలో దేశవాళీ క్రికెట్​ పునః ప్రారంభానికి బీసీసీఐ సిద్ధమవుతోంది. అయితే, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని దేశవాళీ పోటీల షెడ్యూల్​ బ్లూ ప్రింట్​ను అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు పంపింది భారత క్రికెట్​ బోర్డు. ఇందులో వారికి నాలుగు ఆప్షన్లను ఇచ్చింది.

ఆప్షన్-1: కేవలం రంజీ ట్రోఫీ మాత్రమే నిర్వహించడం.

ఆప్షన్-2: కేవలం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ జరపడం.

ఆప్షన్-3: రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ కూడా నిర్వహించడం.

ఆప్షన్-4: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీతో పాటు విజయ్ హజారే ట్రోఫీ జరపడం.

ఈ ఆప్షన్లలో అత్యధిక రాష్ట్ర సంఘాలు దేనివైపు మొగ్గుచూపితే ఆ విధంగా దేశవాళీ క్రికెట్​ను ముందుకు తీసుకెళ్లాలని బీసీసీఐ యోచిస్తోంది. రంజీ ట్రోఫీకి(జనవరి 11-మార్చి 18) 67 రోజులు, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీకి(డిసెంబర్​ 20-జనవరి 10)22 రోజులు, విజయ్ హజారే టోర్నీకి(జనవరి 11-ఫిబ్రవరి 7)28 రోజులు అవసరమవుతాయని లేఖలో పేర్కొంది బోర్డు.

దేశవాళీ క్రికెట్​లో పాల్గొనే 38 జట్ల కోసం దేశం మొత్తం మీద 6 బయో సెక్యూర్ బుడగలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది బోర్డు. ఒక్కో బుడగ ఆధ్వర్యంలో మూడు మైదానాలు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి: ఐపీఎల్​ వేలం కోసమే ముస్తాక్​​ అలీ టోర్నీ నిర్వహణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.