ETV Bharat / sports

'నాతో నాకే పోటీ.. నాకు నేనే సాటి' - కోహ్లీ బాబర్​ అజామ్​

టీమ్ఇండియా సారథి కోహ్లీతో తనను పలువురు పోల్చడంపై పాకిస్థాన్​ సారథి బాబర్​ అజామ్ మాట్లాడుతూ.. తనతో తనకే పోటీ అని చెప్పాడు​. పాకిస్థాన్​ను విజయపథం వైపు నడిపించడమే తన లక్ష్యమని చెప్పాడు.

babrar
బాబర్​
author img

By

Published : Dec 1, 2020, 5:33 AM IST

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీతో తనను పోల్చడంపై స్పందించాడు పాకిస్థాన్​ క్రికెట్​ జట్టు కెప్టెన్​ బాబర్​ అజామ్​. తనకు తానే సాటి అని చెప్పాడు.

"మంచి ఆటగాళ్లతో పోల్చినప్పుడు బాగానే ఉంటుంది. లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి ఆ ప్రశంసలు బాగా ఉపయోగపడతాయి. మనలో మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కానీ నా మనస్తత్వం అలా ఉండదు. నాకు నేనే పోటి. నా లక్ష్యాన్ని నేనే నిర్దేశించుకుంటా. బెంచ్​మార్క్​ను సెట్​ చేస్తా. మ్యాచుల్లో గెలిచి పాకిస్థాన్​ను విజయపథంలో నడిపించడమే నా లక్ష్యం."

-బాబర్​ అజామ్​, పాక్​ సారథి.

​ప్రస్తుతం బాబర్​ అజామ్​ న్యూజిలాండ్​ పర్యటనలో భాగంగా 14 రోజుల నిర్బంధంలో ఉన్నాడు. ఈ పర్యటనలో ఇరు జట్ల మధ్య మూడు టీ20లు, రెండు టెస్టులు జరగాల్సి ఉంది. ఇటీవలే పాక్ జట్టు మూడు ఫార్మాట్లకు కెప్టెన్​గా ఎంపికయ్యాడు బాబర్​.

ఇదీ చూడండి : పాకిస్థాన్​ కెప్టెన్​ బాబర్ అజమ్​పై రేప్ కేసు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.