ఐపీఎల్లో సత్తాచాటిన యువ బౌలర్ నటరాజన్ భారత జట్టులో చోటు సంపాదించాడు. తొలుత ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన నటరాజన్.. టెస్టు జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. తాజాగా టీమ్ఇండియా టెస్టు జెర్సీ ధరించిన నట్టూ ఆ ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఈ జెర్సీ ధరించడం ఎంతో గర్వంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశాడు.
-
A proud moment to wear the white jersey 🇮🇳 Ready for the next set of challenges 👍🏽#TeamIndia @BCCI pic.twitter.com/TInWJ9rYpU
— Natarajan (@Natarajan_91) January 5, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">A proud moment to wear the white jersey 🇮🇳 Ready for the next set of challenges 👍🏽#TeamIndia @BCCI pic.twitter.com/TInWJ9rYpU
— Natarajan (@Natarajan_91) January 5, 2021A proud moment to wear the white jersey 🇮🇳 Ready for the next set of challenges 👍🏽#TeamIndia @BCCI pic.twitter.com/TInWJ9rYpU
— Natarajan (@Natarajan_91) January 5, 2021
"తెలుపు (టెస్టు) జెర్సీ ధరించడం ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్ ఛాలెంజ్‌లకు సిద్ధంగా ఉన్నా" అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు నట్టూ. ప్రస్తుతం మూడో టెస్టు కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడీ పేసర్. ఈనెల 7 నుంచి సిడ్నీ వేదికగా ఈ టెస్టు జరగనుంది.