సిడ్నీలో నిర్బంధాన్ని పూర్తి చేసుకుని బుధవారం జట్టుతో కలిసిన రోహిత్‌శర్మ.. గురువారం నుంచి నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. 'హిట్‌మ్యాన్ ఇంజిన్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది' అని బీసీసీఐ పోస్టు పెడుతూ.. ప్రాక్టీసులోని రోహిత్ ఫొటోలను పంచుకుంది.
ఆస్ట్రేలియాతో జరగనున్న సిడ్నీ, బ్రిస్బేన్ రెండు టెస్టుల్లో రోహిత్‌శర్మకు ఆడే అవకాశం దక్కనుంది. దీంతో హిట్‌మ్యాన్ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకున్న రోహిత్‌ను బీసీసీఐ మెడికల్ స్టాఫ్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
-
The engine is just getting started and here is a quick glimpse of what lies ahead. #TeamIndia #AUSvIND pic.twitter.com/3UdwpQO7KY
— BCCI (@BCCI) December 31, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The engine is just getting started and here is a quick glimpse of what lies ahead. #TeamIndia #AUSvIND pic.twitter.com/3UdwpQO7KY
— BCCI (@BCCI) December 31, 2020The engine is just getting started and here is a quick glimpse of what lies ahead. #TeamIndia #AUSvIND pic.twitter.com/3UdwpQO7KY
— BCCI (@BCCI) December 31, 2020
ఆస్ట్రేలియా పర్యటనలోని నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్, ఆసీస్ చెరో మ్యాచ్‌లో విజయం సాధించి.. సిరీస్‌ను సమం చేశాయి. సిడ్నీ వేదికగా మూడో మ్యాచ్ జనవరి 7న ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి: ఆసీస్‌తో టెస్టు సిరీస్ నుంచి ఉమేశ్ ఔట్!