ETV Bharat / sports

'వీడ్కోలు రోజు ధోనీ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు' - MS Dhoni retirement

మహేంద్ర సింగ్ ధోనీ.. టెస్టు కెరీర్​కు వీడ్కోలు పలికిన రోజు రాత్రి ఏడుస్తూనే ఉన్నాడని చెప్పాడు బౌలర్ అశ్విన్. దీనితోపాటే మహీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

'వీడ్కోలు రోజు ధోనీ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు'
ధోనీ
author img

By

Published : Aug 19, 2020, 5:55 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీకి టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు. దేశ క్రికెట్‌కు అతడెంతో సేవ చేశాడని ప్రశంసించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మహీ కొన్నిసార్లు భావోద్వేగానికి గురవుతాడని వెల్లడించాడు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు ప్రకటించిన రోజు టీమ్‌ఇండియా జెర్సీ ధరించి కన్నీరు కార్చాడని వివరించాడు.

'2014లో మహీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం నాకు గుర్తుంది. మెల్‌బోర్న్‌లో మ్యాచ్‌ను కాపాడేందుకు ఆ రోజు మేమిద్దరం ఎంతో కష్టపడ్డాం. కానీ ఓడిపోయాం. అప్పుడతను స్టంప్‌ తీసుకొని ఇక నేను ముగించేస్తున్నా అని సాధారణంగా చెప్పాడు. అదో భావోద్వేగ సన్నివేశం. నేనూ, సురేశ్‌ రైనా, ఇషాంత్‌ శర్మ సాయంత్రం మహీ గదిలోనే కూర్చున్నాం. ఆ రాత్రంతా అతడు టీమ్‌ఇండియా జెర్సీలోనే ఉన్నాడు. కన్నీరు కార్చాడు' -అశ్విన్, భారత సీనియర్ బౌలర్

మహీతో తనకు ఎన్నో మరుపురాని సంఘటనలు ఉన్నాయని అశ్విన్ చెప్పాడు. చెపాక్‌లో భారత్‌-వెస్టిండీస్‌ టెస్టు జరిగేటప్పుడు తొలిసారి ధోనీని కలిశానన్నాడు. అప్పుడు నెట్‌బౌలర్‌గా ఉన్నానని పేర్కొన్నాడు. 2008లో చెన్నై సూపర్‌కింగ్స్‌లో చేరానని తెలిపాడు. అతడి వద్ద చాలా సమయం గడిపి ఎంతో నేర్చుకున్నానని వివరించాడు. 2010 ఛాంపియన్స్‌ లీగ్‌లో మహీ తనకో ముఖ్యమైన పాఠం చెప్పాడని అన్నాడు.

'విక్టోరియా బస్‌రేంజర్స్‌తో మ్యాచులో నేను సూపర్ ఓవర్‌ వేశాను. అప్పుడు ధోనీ నా దగ్గరికొచ్చి ఒత్తిడిలో నేను అత్యుత్తమంగా బంతులు వేయలేదని చెప్పాడు. క్యారమ్‌ బంతిని ఎక్కువగా ఉపయోగించాలని సలహా ఇచ్చాడు' అని అశ్విన్ అప్పటి సంఘటల్ని గుర్తు చేసుకున్నాడు. 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో తాను వికెట్లు తీయకున్నా ఎంతో ప్రోత్సహించాడని తెలిపాడు. ఓ పక్క జడేజాకు వికెట్లు పడుతున్నా.. నీ బౌలింగ్‌ విధానం, ఆలోచనా విధానం బాగుందని ఇలాగే కొనసాగాలని అండగా నిలిచాడని అశ్విన్‌ పేర్కొన్నాడు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.