ETV Bharat / sports

దేశవాళీ టోర్నీలో సచిన్ తనయుడికి ఛాన్స్ - Arjun Tendulkar picked in Mumbai's senior squad for first time

సయ్యద్​ ముస్తాక్​ అలీ టోర్నీలో పాల్గొనే ముంబయి జట్టులో అర్జున్​ తెందూల్కర్​కు చోటు లభించింది. ఈ విషయాన్ని జట్టు చీఫ్​ సెలక్టర్​ సలీల్​ అంకోలా స్పష్టం చేశారు.

arjun
అర్జున్​
author img

By

Published : Jan 2, 2021, 7:18 PM IST

టీమ్ఇండియా దిగ్గజ క్రికెటర్ సచిన్​ తెందూల్కర్​​ తనయుడు అర్జున్​ తెందూల్కర్​కు ఎట్టకేలకు కోరుకున్న అవకాశం లభించింది. వచ్చే ఏడాది జనవరిలో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో ముంబయి జట్టు తరఫున బరిలో దిగనున్నాడు అర్జున్. ఈ విషయాన్ని సదరు జట్టు చీఫ్​ సెలక్టర్​ సలీల్​ అంకోలా శనివారం స్పష్టం చేశారు.

"బీసీసీఐ జట్టులో తొలుత 20మందిని మాత్రమే ఎంపిక చేయాలని ఆదేశించింది. కానీ తర్వాత జట్టులోని ఆటగాళ్ల సంఖ్యను 22కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్జున్​ తెందూల్కర్​, కృతిక్​ హంగవాడిని ఎంపిక చేశాం."

-సలీల్​ అంకోలా, ముంబయి జట్టు చీఫ్​ సెలక్టర్

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ కోసం తొలుత 20మందితో కూడిన జట్టును ప్రకటించింది ముంబయి. అయితే ఈ బృందంలో అర్జున్​ను ఎంపిక చేయలేదు సెలక్టర్లు. అంతకుముందు ముంబయి ప్రాబబుల్స్‌లో చోటు దక్కించుకున్న అతడు​.. అనంతరం జరిగిన ప్రాక్టీస్ మ్యాచుల్లో అంచనాల్ని అందుకోలేకపోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. ప్రస్తుతం బీసీసీఐ జట్టు సభ్యులను పెంచుకోవచ్చని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అర్జున్​తో పాటు మరొకరికి చోటు దక్కింది.

ఇదీ చూడండి : దేశవాళీ టోర్నీలో సచిన్ తనయుడికి నో ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.