ETV Bharat / sports

ఐపీఎల్​:​ అప్పటి జట్ల సారథులే.. ఇప్పుడు కోచ్​లు - ipl bcci news updates

2008లో ఐపీఎల్​ మైదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది క్రికెటర్లు తమ ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నారు. అలా ఒక ఆటగాడి స్థాయి నుంచి జట్టుకు కెప్టెన్​గా.. అనతి కాలంలో అవే ఐపీఎల్​ జట్లకు కోచ్​లుగానూ వ్యవహరించారు. అలా ఐపీఎల్​ ఫ్రాంచైజీలకు కోచ్​లుగా ఉన్న టాప్​-5 మాజీ కెప్టెన్లపై ఓ లుక్కేద్దాం రండి.

Anil Kumble to Brendon McCullum: Former IPL captains who now coach youngsters
ఐపీఎల్​ జట్టు కోచ్​లు
author img

By

Published : Aug 13, 2020, 6:01 AM IST

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏకైక టోర్నమెంట్​ ఐపీఎల్. కరోనాతో లభించిన సుదీర్ఘ విరామం అనంతరం అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న అతిపెద్ద లీగ్​ ఇదే కావడం విశేషం. ఈ క్రమంలోనే యూఏఈ వేదికగా జరిగే ఈ టోర్నమెంటుకు ఆటగాళ్లంతా మరింత హుషారుతో సన్నద్దమవుతున్నారు.

అయితే, ఐపీఎల్​ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్​ క్రికెటర్లు ప్రేక్షకులను తమ ప్రదర్శనతో అలరించారు. అనతి కలంలోనే వారు ఆయా జట్లకు సారథ్యం వహించారు. ప్రస్తుతం వారు అదే ఐపీఎల్ పలు​ జట్లకు కోచ్​లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. అలా కెప్టెన్ నుంచి కోచ్​లుగా మారిన ప్రముఖ క్రికెటర్లెవరో తెలుసుకుందాం రండి.

Anil Kumble to Brendon McCullum: Former IPL captains who now coach youngsters
అనిల్​ కుంబ్లే

భారత మాజీ స్పిన్నర్​ అనీల్​ కుంబ్లే తన హోం ఫ్రాంచైజీ రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు(ఆర్సీబీ) తరఫున ఐపీఎల్​ తొలి మూడు సీజన్లలో ఆడాడు. 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన ఐపీఎల్​ ఫైనల్​లో జట్టుకు సారథ్యం వహించి.. ఫైనల్​ వరకు తీసుకొచ్చాడు. అయితే అప్పుడు ఆర్సీబీ జట్టు డక్కన్ ఛార్జర్స్ చేతిలో పరాజయం పొందింది.

ప్రస్తుతం కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​ జట్టుకు ప్రధాన కోచ్​గా వ్యవహరిస్తున్నాడు కుంబ్లే. తన శిక్షణలో గొప్ప ఆటగాళ్ల బృందాన్ని ఏర్పాటు చేశాడు. కుంబ్లే తన ఐపీఎల్ కెరీర్​లో 42 మ్యాచ్​లు ఆడి 45 వికెట్లు పడగొట్టాడు. 26 మ్యాచ్​ల్లో ఆర్సీబీకి నాయకత్వం వహించగా.. 15 మ్యాచ్​లు గెలిపించాడు.

బ్రెండన్​ మెక్కల్లమ్

ఐపీఎల్ మొదటి మూడు సీజన్లలో న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్​ మెక్​కల్లమ్ కోల్​కతా నైట్​రైడర్స్​(కేకేఆర్​) తరఫున ఆడాడు. అనంతరం 2012-13 మధ్య జరిగిన లీగ్​లో మరోసారి కనువిందు చేశాడు. 2009లో మెక్​కల్లమ్​ ​కేకేఆర్ జట్టుకు కెప్టెన్​గా వ్యవహరించినప్పటికీ.. ఆ ఏడాది​ ఐపీఎల్​ టాప్​ నాలుగు స్థానాల్లో జట్టు నిలవలేకపోయింది. సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత కివీస్​ ఆటగాడు గుజరాత్​ లయన్స్​కు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం 2020 ఐపీఎల్ కోసం కేకేఆర్​ ప్రధాన కోచ్​గా నియమితుడయ్యాడు.

రికీ పాంటింగ్

ఈ వరుసలో నిలిచిన మరో స్టార్​ క్రికెటర్ రికీ పాంటింగ్​. ​2013 వరకు అతనికి ఐపీఎల్​ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కలేదు. అనంతరం ముంబయి ఇండియన్స్​ అతన్ని కెప్టెన్​గా నియమించింది. కానీ, ఆరు మ్యాచ్​ల తర్వాత తనకు తానే తప్పుకున్నాడు. అప్పుడు రోహిత్​ శర్మ కొత్త సారథిగా ఎన్నికయ్యాడు. 2018లో పాంటింగ్​ను దిల్లీ క్యాపిటల్స్​కు ప్రధాన కోచ్​గా ఎంపిక చేశారు. గతేడాది ఐపీఎల్​లో జట్టును మూడో స్థానానికి వెళ్లడంలో, ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడంలో బాగా కృషి చేశాడు. ఈ సారి ఎలాగైనా తమ ఫ్రాంచైజీకి టైటిల్​ అందించాలని పట్టుదలతో ఉన్నాడు.

మహేలా జయవర్ధనే

ఇక మాజీ శ్రీలంక కెప్టెన్​ మహేలా జయవర్ధనే 2010లో కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​కు కెప్టెన్​గా వ్యవహరించి.. అనంతరం కొచ్చి టస్కర్స్​ కేరళ(కేటీకే), డిల్లీ డేర్​డెవిల్స్​(డీడీ)లకు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. 2017లో ముంబయి జట్టు కోచింగ్​​ సిబ్బందిలో రికీ పాంటింగ్​ స్థానంలో జయవర్ధనేను నియమించింది. అతని శిక్షణలో ముంబయి మూడు సార్లు టైటిల్​ గెలుచుకుంది.

జేమ్స్​ హోప్స్

దిల్లీ, కింగ్స్​ ఎలెవెన్​ పంజాబ్​, పుణే వారియర్స్​ జట్ల తరఫున ఆడిన ఆటగాడు ఆస్ట్రేలియా పేసర్​, ఆల్​రౌండర్​ జేమ్స్​ హోప్స్. తన ఐపీఎల్​ కెరీర్​లో 417 పరుగులు చేసి.. 14 వికెట్లు పడగొట్టాడు. 2011లో మూడు మ్యాచ్​లకు డిల్లీ డేర్​డెవిల్స్​ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే, ఒక్క మ్యాచ్​ కూడా గెలవలేదు. అయినప్పటికీ, 2018లో ఫ్రాంచైజీ అతన్ని ఫాస్ట్​ బౌలింగ్​ కోచ్​గా నియమించింది. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్​ ప్రారంభం కానున్న వేళ.. టైటిల్​ దక్కించుకోవడం కోసం బౌలర్లను సిద్ధం చేస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.