ETV Bharat / sports

భారత క్రికెటర్ల హోటల్ బిల్​ కట్టిన అభిమాని - నవ్​దీప్​ సైనీ

మెల్​బోర్న్​లోని ఓ హోటల్​లో రెస్టారెంట్​కు వెళ్లిన భారత క్రికెటర్ల బిల్​ను ఓ అభిమాని, వారికి తెలియకుండానే కట్టేశాడు. వాళ్లతో తీసుకున్న ఫొటోను ట్విట్టర్​లో పంచుకున్నాడు.

An Indian fan pays the bill for indian cricketers in Melbourne restaurant
భారత క్రికెటర్ల హోటల్ బిల్​ కట్టిన అభిమాని
author img

By

Published : Jan 2, 2021, 9:33 AM IST

Updated : Jan 2, 2021, 11:32 AM IST

భారత్​లో క్రికెట్​కు ఉన్న క్రేజ్​ మరెక్కడా ఉండదు. ఆటగాళ్లను పూజించడం.. అభిమాన క్రికెటర్​ కోసం వందల కిలోమీటర్లు ప్రయాణం చేయడం మనదేశంలోనే చూశాం. ఇదే తరహాలో తన ప్రేమను హోటల్ బిల్​ రూపంలో చెల్లించాడో అభిమాని.

ఎప్పుడు? ఎక్కడ?

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​ ఆడుతున్న టీమ్ఇండియా క్రికెటర్లు.. న్యూయర్​ రోజు మెల్​బోర్న్​లో ఓ రెస్టారెంట్​​కు వెళ్లారు. అక్కడ రోహిత్​, పంత్, సైనీ, గిల్​లను చూసిన అభిమాని నవల్​దీప్​ సింగ్​ ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. వారికి తెలియకుండానే వారి టేబుల్​ బిల్ రూ.6,683ను కట్టేశాడు.

ఈ విషయం తెలుసుకున్న రోహిత్​.. డబ్బులు తిరిగి తీసుకోవాల్సిందిగా నవల్​దీప్​ను కోరాడు. అందుకు అతడు​ ససేమిరా అనగా.. అలా చేస్తేనే ఫొటో ఇస్తాం అని పంత్ సరదాగా అన్నాడు. అనంతరం నవల్​దీప్​, అతడి భార్య క్రికెటర్లతో ఫొటో తీసుకున్నారు.

ఇదీ చూడండి: 'అంపైర్​ నిర్ణయంతో కాదు.. గెట్​ అవుట్ అన్నందువల్లే'

Last Updated : Jan 2, 2021, 11:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.