ETV Bharat / sports

అడిలైడ్​లో భారత్​-ఆస్ట్రేలియా బాక్సింగ్​ డే టెస్ట్​! - బాక్సింగ్​ డే టెస్ట్​

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్​బోర్న్​ వేదికగా జరగాల్సిన బాక్సింగ్​ డే టెస్ట్​ను అడిలైడ్​ స్టేడియానికి తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మెల్​బోర్న్​లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో క్రికెట్​ ఆస్ట్రేలియా ఈ చర్యలు చేపట్టనున్నట్టు సమాచారం.

Amid Coronavirus Fears, Cricket Australia Contemplates Moving Boxing Day Test Against India To Adelaide
అడిలైడ్​లో భారత్​-ఆస్ట్రేలియా బాక్సింగ్​ డే టెస్ట్​!
author img

By

Published : Aug 6, 2020, 9:06 PM IST

Updated : Aug 6, 2020, 9:24 PM IST

ఈ ఏడాది చివర్లో.. టీమ్​ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. టెస్ట్​ సిరీస్​లో భాగంగా.. మెల్​బోర్న్​ వేదికగా డిసెంబర్​ 26-30 మధ్య సంప్రదాయ బాక్సింగ్​ డే టెస్ట్​ జరగాల్సి ఉంది. అయితే మెల్​బోర్న్​లో కరోనా వైరస్​ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్​ను అడిలైడ్​కు తరలించేందుకు క్రికెట్​ ఆస్ట్రేలియా యోచిస్తున్నట్టు సమాచారం.

సిడ్నీ మార్నింగ్​ హెరాల్డ్​ కథనం ప్రకారం.. బాక్సింగ్​ డే కోసం మెల్​బోర్న్​కు ప్రత్యామ్నాయంగా రేసులో అడిలైడ్​ ఉంది. ఈ మేరకు క్రికెట్​ ఆస్ట్రేలియా ఛైర్మన్​ ఈర్ల్​ ఎడ్డింగ్స్​.. వచ్చే వారంలో అత్యవసర జాతీయ క్రికెట్​ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించనున్నారు.

కరోనా వైరస్​తో విక్టోరియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుత షెడ్యూల్​తోనే మ్యాచ్​లు నిర్వహించడం కుదరదని సీనియర్​ అధికారి వెల్లడించారు.

భారత్​-ఆస్ట్రేలియా మధ్య బ్రిస్బేన్​ వేదికగా డిసెంబర్​ 3 నుంచి మొదటి టెస్ట్​ ప్రారంభంకానుంది. డిసెంబర్​ 11-15 మధ్య రెండో టెస్ట్​ జరగనుంది. ఇదే భారత్​ విదేశాల్లో ఆడనున్న తొలి డే/నైట్​ టెస్ట్​ మ్యాచ్ ​కానుంది.

ఇదీ చూడండి:- దిగ్గజ క్రికెటర్ లారాకు కరోనా సోకిందా?

Last Updated : Aug 6, 2020, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.