రాబోయే రంజీ సీజన్లో హైదరాబాద్ జట్టుకు ఆడాలనుకోవట్లేదని చెప్పిన క్రికెటర్ అంబటి రాయుడు.. మరోసారి వార్తల్లో నిలిచాడు. అయితే ఈ పరిస్థితికి కారణం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఉన్న అవినీతియేనని అన్నాడు.
"ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున రంజీలు ఆడాలనుకున్నాను. కాకపోతే పరిస్థితులు మారాయి. హెచ్‌సీఏలో చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. అందుకే నేను జట్టు నుంచి తప్పుకున్నాను" -అంబటి రాయుడు, బ్యాట్స్‌మన్
హైదరాబాద్ క్రికెట్లో జరుగుతున్న అవినీతి గురించి చెబుతూ, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను టాగ్ చేస్తూ, శనివారం ఓ ట్వీట్ చేశాడు రాయుడు.
-
Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet.
— Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet.
— Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019Hello sir @KTRTRS, I request u to plz look into nd address the rampant corruption prevailing in hca. Hw can hyderabad be great when it's cricket team is influenced by money nd corrupt ppl who hav numerous acb cases against them which are being swept under the carpet.
— Ambati Rayudu (@RayuduAmbati) November 23, 2019
కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. మనసు మార్చుకుని దేశవాళీల్లో హైదరాబాద్ తరఫున ఆడతానని ప్రకటించాడు. ఈ జట్టుకే విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా జట్టు నుంచి బయటకొచ్చేశాడు.
హెచ్‌సీఏలోని ప్రస్తుత పరిస్థితుల గురించి అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్‌కు చెప్పినా, పట్టించుకోవట్లేదని అన్నాడు రాయుడు.
ఇది చదవండి: అంబటి రాయుడు వీడ్కోలు పలికాడా.. పలకాల్సి వచ్చిందా..!