ఆదివారం జరిగిన ముస్తాక్ అలీ ట్రోఫీ తుదిపోరులో కర్ణాటక విజేతగా నిలిచింది. తమిళనాడుపై 1 పరుగు తేడాతో విజయం సాధించింది. వరుసగా రెండో ఏడాది ట్రోఫీ నిలబెట్టుకుంది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఒకే ఏడాది విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలు గెల్చుకున్న మొదటి టీమ్‌గా నిలిచింది.
-
Dominance!
— BCCI Domestic (@BCCIdomestic) December 1, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
2018 ✅
2019 ✅
Yet another Syed Mushtaq Ali trophy title for Karnataka.
For full scorecard - https://t.co/A0AkLqDVNZ#KARvTN @paytm #MushtaqAliT20 pic.twitter.com/UZeWgnK5Go
">Dominance!
— BCCI Domestic (@BCCIdomestic) December 1, 2019
2018 ✅
2019 ✅
Yet another Syed Mushtaq Ali trophy title for Karnataka.
For full scorecard - https://t.co/A0AkLqDVNZ#KARvTN @paytm #MushtaqAliT20 pic.twitter.com/UZeWgnK5GoDominance!
— BCCI Domestic (@BCCIdomestic) December 1, 2019
2018 ✅
2019 ✅
Yet another Syed Mushtaq Ali trophy title for Karnataka.
For full scorecard - https://t.co/A0AkLqDVNZ#KARvTN @paytm #MushtaqAliT20 pic.twitter.com/UZeWgnK5Go
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కెప్టెన్ మనీశ్ పాండే 60 పరుగులతో రాణించాడు. మిగతా వారిలో కేఎల్ రాహుల్ 22, దేవదూత్ 32, రోహన్ కడమ్ 35 పరుగులతో ఆకట్టుకున్నారు.
అనంతరం ఛేదనలో తమిళనాడు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. షారుక్ ఖాన్ 16, హరి నిశాంత్ 14, వాషింగ్టన్ సుందర్ 24, దినేశ్ కార్తిక్ 20, బాబా అపరాజిత్ 40, విజయ్ శంకర్ 44 పరుగులు చేశారు. కానీ జట్టుకు విజయం అందించలేకపోయారు.