ఓవైపు ఐపీఎల్ జరుగుతుండగా మరోవైపు బీసీసీఐ, ఆస్ట్రేలియా పర్యటన ఏర్పాట్లపై దృష్టిపెట్టింది. భారత జట్టు నవంబరు 12న ప్రత్యేక విమానంలో బయల్దేరనుంది. బోర్డు ప్రస్తుతం యూఏఈలో లేని ఆటగాళ్లు, సహాయ సిబ్బందిని ఈ నెలాఖరుకు దుబాయ్ పిలిపించనుంది. పుజారా, హనుమ విహారి, కోచ్ రవిశాస్త్రి, ఐపీఎల్‌లో భాగం కాని సహాయ సిబ్బందిలోని ఇతర సభ్యుల కోసం ప్రత్యేక బయో బబుల్‌ను సృష్టించనుంది.
ఆస్ట్రేలియాలో భారత జట్టు క్వారంటైన్ కాలం ఎక్కువ ఉండకుండా చూడాలన్నది బీసీసీఐ ఉద్దేశం. అయితే ఆ దేశంలో భారత జట్టు స్థావరం ఎక్కడ అన్నది ఇంకా స్పష్టం కాలేదు.