శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌ను కోల్పోయిన పాకిస్థాన్ జట్టుపై విమర్శలు వస్తున్నాయి. టీ20ల్లో నంబర్ వన్ జట్టుగా పేరు తెచ్చుకున్న పాక్.. లంక చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక స్టార్ ఆటగాళ్లు పాక్ పర్యటనకు రాకపోయినప్పటికీ.. యువ క్రికెటర్లు పాక్‌ను క్లీన్‌స్వీప్ చేసి సత్తా చాటారు. తాజాగా ఈ విషయంపై స్పందించిన పాకిస్థాన్ మాజీ సారథి ఆమిర్ సోహైల్.. పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు.
"ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పీసీబీ చెబుతోంది. కానీ ఆటగాళ్లు క్రికెట్‌కు తక్కువ.. ఒలింపిక్స్, రెజ్లింగ్ పోటీలకు ఎక్కువ సన్నాహకాలు చేస్తున్నట్లు కనబడుతోంది.
-ఆమిర్ సోహైల్, పాక్ మాజీ సారథి
ఇటీవలే పాకిస్థాన్ ప్రధాన కోచ్‌గా నియమితుడైన మిస్బావుల్ హక్ ఇప్పటికే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. కఠిన ఆహార నియమాలను తీసుకొచ్చాడు. బిర్యానీతో పాటు నూనె ఎక్కువగా వేసి వండే మాంసాహారం, స్వీట్స్‌కు దూరంగా ఉండాలని సూచించాడు.
ఇవీ చూడండి.. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న సానియా..