ETV Bharat / sports

ఆల్​రౌండర్లు లేకుండా ఆకాశ్ చోప్రా ఐపీఎల్ జట్టు - ఆకాష్​ చోప్రా ఐపీఎల్​ ఆల్​టైమ్​ ఫేవరేట్​ జట్టు

ఐపీఎల్​లో తన ఆల్​టైమ్​ ఫేవరెట్​ జట్టును తయారు చేశాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. ఇందులో ఒక్క ఆల్​రౌండర్​నూ తీసుకోకుండా అత్యధికంగా ఐదుగురు బౌలర్లను ఎంచుకున్నాడు. వీరితో పాటు మరో రెండు రిజర్వ్​ స్థానాలను ప్రకటించాడు.

Aakash Chopra names his all-time IPL XI; picks five specialist bowlers in the star-studded team
ఆకాష్​ ఐపీఎల్​ ఫేవరేట్​ టీమ్​లో ఆల్​రౌండర్లు లేరు!
author img

By

Published : Jun 29, 2020, 2:35 PM IST

ఐపీఎల్​లో తన ఆల్​టైమ్​ ఫేవరెట్​ జట్టును ప్రకటించాడు భారత మాజీ క్రికెటర్​ ఆకాశ్​ చోప్రా. ఒక్క ఆల్​రౌండర్​ కూడా లేకుండా ఐదుగురు బౌలర్లను ఎంపిక చేశాడు. ఐపీఎల్​లో నిలకడగా రాణిస్తున్న ఆస్ట్రేలియా ఓపెనర్​ డేవిడ్​ వార్నర్​తో పాటు ఈ లీగ్​లో ఎక్కువ ట్రోఫీలు సాధించిన కెప్టెన్​గా పేరొందిన రోహిత్​ శర్మలను ఓపెనర్లుగా తీసుకున్నాడు. ఆ తర్వాత మూడు, నాలుగు స్థానాలకుగానూ సురేశ్ రైనా, విరాట్​ కోహ్లీలను ఎంచుకున్నాడు.

మిడిలార్డర్​లో ఏబీ డివిలియర్స్​, ఎంఎస్​ ధోనీలను తీసుకున్నాడు ఆకాశ్. వీరిద్దరూ మైదానంలో కలిసి ఆడితే చూడాలని ఎంతోమంది అభిమానులు ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ధోనీని జట్టుకు కెప్టెన్​గా, వికెట్​ కీపర్​గా నియమించాడు. స్పిన్నర్​ హర్భజన్​ సింగ్​, సునీల్​ నరైన్​లతో పాటు భువనేశ్వర్​ కుమార్, జస్​ప్రీత్​ బుమ్రా, లసిత్​ మలింగాలను పేసర్లుగా ఎంపిక చేశాడు. వీరితో పాటు మరో రెండు రిజర్వ్​డ్​ స్థానాలను ప్రకటించాడు. వారిలో గౌతమ్​ గంభీర్​, ఆండ్రూ రస్సెల్​లు ఉన్నారు.

ఆకాశ్​ చోప్రా.. ఐపీఎల్​ ఆల్​టైమ్​ ఫేవరెట్​ జట్టు

డేవిడ్​ వార్నర్​, రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ, సురేష్​ రైనా, ఏబీ డివిలియర్స్​, ఎంఎస్​ ధోనీ (కెప్టెన్​, వికెట్​ కీపర్), హర్భజన్​ సింగ్​, సునీల్​ నరైన్​, భువనేశ్వర్​ కుమార్​, లసిత్​ మలింగా, జస్​ప్రీత్​ బుమ్రా.

12, 13 స్థానాల్లో: గౌతమ్​ గంభీర్​, ఆండ్రూ రస్సెల్​.

ఇదీ చూడండి... అలా ఆడటం కోహ్లీకే సాధ్యం: బ్యాటింగ్ కోచ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.