ETV Bharat / sports

ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టుపై​ డాక్యుమెంటరీ

2020లో టీ20 మహిళల ప్రపంచకప్​ గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టుపై ఓ డాక్యుమెంట్​ తయారైంది. దీన్ని ది రికార్డ్ పేరుతో అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదల చేసింది క్రికెట్​ ఆస్ట్రేలియా. ఇందుకు సంబంధించిన ట్రైలర్​ను తాజాగా ఆవిష్కరించింది.

A document has been made on the Australian team that won the 2020 T20 Women's World Cup.
ఆస్ట్రేలియా మహిళ క్రికెట్ జట్టుపై​ డాక్యుమెంటరీ
author img

By

Published : Feb 8, 2021, 10:46 AM IST

ఆస్ట్రేలియా మహిళ క్రికెట్​ జట్టుపై తయారు చేసిన డాక్యుమెంటరీ 'ది రికార్డ్' ట్రైలర్​ను క్రికెట్​ ఆస్ట్రేలియా విడుదల చేసింది. వచ్చే శుక్రవారం అమెజాన్​ ప్రైమ్​ వేదికగా ఇది విడుదల అవుతుంది. 2020 మహిళల టీ20 ప్రపంచకప్​ను గెలుపొందిన ఆస్ట్రేలియా జట్టు సాగించిన ప్రయాణమే ఈ డాక్యుమెంటరీ స్టోరీ.

కరోనా వల్ల ప్రపంచం మొత్తం క్రీడలు ఆగిపోవడానికి వారం ముందు ఆస్ట్రేలియా మహిళ క్రికెట్​ జట్టు ఒక గుర్తింపును సాధించింది. మెల్​బోర్న్​ వేదికగా.. అంతర్జాతీయ మహిళ దినోత్సవం నాడు జరిగిన ప్రపంచకప్​ ఫైనల్లో ఆస్ట్రేలియా వీరోచితంగా ఆడి ట్రోఫీ​ గెలుచుకుంది. చాలా మంది ఆటగాళ్లు గాయాలపాలైనప్పటికీ కెప్టెన్​ మెక్​ లానింగ్​ అద్భుతంగా జట్టును నడిపించింది. మానసికంగా, శారీరకంగా వాళ్లలో క్రీడాస్ఫూర్తిని నింపింది.

'ది రికార్డ్'​లో ఆస్ట్రేలియా మహిళ జట్టుకు సంబంధించి కొంత మంది ప్లేయర్లు నటించారు. ఆసీస్​ కెప్టెన్​ మెగ్​ లానింగ్, వైస్​ కెప్టెన్​ రాచెల్​ హేన్స్​, ప్రధాన కోచ్​ మాథ్యూ మట్​, ప్లేయర్​ ఆఫ్ ది టోర్నమెంట్​ బెథ్​ మూనీ ఈ డాక్యుమెంటరీలో ఉన్నారు. వీరితో పాటు భారత కెప్టెన్ హర్మన్​ప్రీత్​ కౌర్​, ఇంగ్లాండ్​ కెప్టెన్​ హీథర్​ నైట్​, సౌతాఫ్రికా కెప్టెన్ డేన్​ వాన్​ నైకెర్క్​, థాయ్​లాండ్​ కెప్టెన్​ సోర్నారిన్​ తిప్పోచ్​లు ఉన్నారు.

కాగా ఈ మూవీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, భారత్​, పాకిస్థాన్, శ్రీలంక, యూఎస్​, కెనడా, యూకే సహా 20 దేశాలలో అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదల కానుంది.

'ప్రపంచ కప్​కు సంబంధించి పూర్తి ప్రయాణం ఆధారంగా ఈ డాక్యుమెంటరీ తీయడం ఆనందంగా ఉంది. క్రికెట్​ ఆస్ట్రేలియాకు ఇది ఎంతో గర్వకారణం' అని క్రికెట్​ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్​ హాక్లీ పేర్కొన్నాడు.

ఇదీ చదవండి: ఉత్తరాఖండ్​ వరద బాధితులకు పంత్​ విరాళం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.