ETV Bharat / sports

ఐపీఎల్ ఛాన్స్.. వీళ్ల తలరాతనే మార్చేసింది! - హార్దిక్ పాండ్య ఐపీఎల్

ఆ క్రికెటర్లు అనామకులు. దేశవాళీ టోర్నీల్లో మాత్రమే ఆడేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. అలాంటి వారిని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆపద్బాంధవుడిలా ఆదుకుంది. ఇంతకీ ఆ ఆటగాళ్లెవరు? వేలంలో ఎంత మొత్తం దక్కించుకున్నారు? ప్రస్తుతం ఏ జట్టుకు ఆడుతున్నారు? వంటి విషయాల సమాహారమే ఈ కథనం.

5 IPL cricketers who turned from poor to rich
ఐపీఎల్ ఛాన్స్.. వీళ్ల తలరాతనే మార్చేసింది!
author img

By

Published : Jan 5, 2021, 9:09 AM IST

ఐపీఎల్​.. ప్రపంచంలోనే సూపర్​ సక్సెస్ లీగ్. ఎందరో అనామక క్రికెటర్లను వెలుగులోకి తెచ్చింది. వారి ప్రతిభను అందరికీ తెలిసేలా చేసింది. టీమ్​ఇండియాకు ప్రస్తుతం ఆడుతున్న వారిలో, ఈ లీగ్​లో రాణించి వచ్చినవారే ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఐపీఎల్.. కొందరు క్రికెటర్ల ఆర్థిక పరిస్థితిని​ పూర్తిగా మార్చేసిందంటే నమ్మగలరా? అలాంటి వారి గురించే ఈ కథనం.

పాండ్యా బ్రదర్స్

2015లో ముంబయి ఇండియన్స్, కేవలం రూ.10 లక్షలకే బరోడా ఆటగాడు హార్దిక్ పాండ్యాను సొంతం చేసుకుంది. ఆ సీజన్​లో తన మార్క్​ బ్యాటింగ్​తో అలరించిన హార్దిక్.. జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుత టీమ్​ఇండియాలో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

hardik pandya krunal pandya
హార్దిక్ పాండ్య- కృనాల్ పాండ్య

హార్దిక్ వచ్చిన తర్వాత ఏడాదే రూ.2 కోట్లు వెచ్చించి అతడి సోదరుడు కృనాల్​ను ముంబయి కొనుగోలు చేసింది. అంచనాలకు తగ్గట్లే బ్యాటింగ్, బౌలింగ్​లో రాణిస్తూ జట్టులో ప్రధాన ఆటగాడిగా మారాడు.

అయితే వీరిద్దరి కుటుంబ పరిస్థితి ఐపీఎల్​ ఆడకముందు వరకు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. లీగ్​లో ఆడటం వల్ల పాండ్యా బ్రదర్స్​ ఒక్కసారిగా ధనవంతులైపోయారు.

మహ్మద్ సిరాజ్

హైదరాబాద్​కు చెందిన ఓ ఆటో డ్రైవర్​ కుమారుడు సిరాజ్. రంజీల్లో బాగా ఆడటం వల్ల 2017 ఐపీఎల్​ సీజన్​ కోసం సన్​రైజర్స్ హైదరాబాద్.. ఇతడిని రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. రెండేళ్ల పాటు ఈ జట్టుకు ఆడిన తర్వాత​ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఇతడిని వేలంలో దక్కించుకుంది.

mhmd siraj
మహమ్మద్ సిరాజ్

దీంతో సొంత ఇల్లు కట్టుకుని, మంచి జీవితాన్ని అనుభవిస్తున్నాడు సిరాజ్. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా తరఫున టెస్టు సిరీస్​ ఆడుతున్నాడు.

టి.నటరాజన్

నటరాజన్ తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. కుమారుడి క్రికెట్ కలను నెరవేర్చేందుకు శాయశక్తులా కష్టపడేవారు. కనీస సదుపాయాలు లేనప్పటికీ ఫాస్ట్​ బౌలింగ్​లో రాణించే నటరాజన్​కు జయప్రకాశ్ అనే వ్యక్తి సాయం చేశాడు. దీంతో తమిళనాడు ప్రీమియర్ లీగ్​లో ఆడే అవకాశం దక్కించుకుని, వెలుగులోకి వచ్చాడు.

natarajan ipl news
టి.నటరాజన్

యార్కర్లు పక్కాగా వేసే ఇతడిని, 2017 వేలంలో పంజాబ్ జట్టు రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. గాయాలవడం వల్ల ఆ సీజన్​ పూర్తిగా ఆడలేకపోయాడు. కానీ వచ్చిన మొత్తంతో తన ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడం సహా సొంతూరిలో క్రికెట్ అకాడమీని కూడా ప్రారంభించాడు.

అయితే ఈ ఏడాది హైదరాబాద్​ జట్టు తరఫున అదరగొట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనకు నెట్​ బౌలర్​గా ఎంపికై, అనూహ్యంగా తుదిజట్టులో చోటు దక్కించుకుని ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సహచరుల నుంచి మాజీల వరకు అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

యశస్వి జైస్వాల్

ఉత్తరప్రదేశ్​కు చెందిన యశస్వి జైస్వాల్​కు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఆసక్తి. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల సొంతూరిని విడిచిపెట్టి, ముంబయికి వచ్చి ఎన్నో సమస్యలను తట్టుకుని నిలబడి క్రికెటర్​గా ఎదిగాడు. ఈ క్రమంలో వసతి లేక గుడారాల్లో నివసించడం, ఖర్చులు కోసం పానీపూరి అమ్మడం కూడా చేశాడు.

yashswi jaiswal ipl news
తండ్రితో యశస్వి జైస్వాల్

2019లో భారత్ తరఫున అండర్-19 ప్రపంచకప్​లోనూ అదరగొట్టాడు. గతేడాది ఐపీఎల్​ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ.2.4 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో ఇతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి మారిపోయింది.

రింకూ సింగ్

ఉత్తరప్రదేశ్​కు చెందిన రింకూ సింగ్​ది మధ్య తరగతి కుటుంబం. నాన్న సిలిండర్లు సరఫరా చేసేవారు. ఇద్దరు అన్నలు ఆటో డ్రైవర్, కోచింగ్​ సెంటర్​లో పనిచేసేవారు. రంజీల్లో ఆడుతున్నా సరే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సరిగ్గా అప్పుడే 2018 వేలంలో కోల్​కతా నైట్​రైడర్స్ ఇతడిని రూ.80 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో రింకూ ఆర్థికంగా స్థిరపడ్డాడు.

rinku singh ipl news
ధోనీతో రింకూ సింగ్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.