టీమిండియా మహిళా జట్టులో ఓ యువ కెరటం చోటు దక్కించుకుంది. టీ20లకు వీడ్కోలు చెప్పిన సీనియర్ బ్యాట్స్ఉమెన్ మిథాలీరాజ్ స్థానంలో 15 ఏళ్ల షెఫాలీ వర్మ ఆడనుంది. మహిళల టీ20 ప్రీమియర్ లీగ్ ఛాలెంజ్‌లో మిథాలీ సారథ్యంలోనే ఆడిన ఈ యువ క్రికెటర్... దూకుడైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది. దేశవాళీ టోర్నీల్లోనూ సత్తా చాటి, త్వరలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో అరంగేట్రం చేయనుంది. గురువారం ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మూడు మ్యాచ్‌లకు జట్టును ప్రకటించింది సెలక్షన్ కమిటీ. ఇందులో షెఫాలీకి అవకాశం లభించింది.
దేశవాళీ క్రికెట్, అండర్-23లో 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసింది షెఫాలీ. అండర్-19 టోర్నీలోనూ విధ్వంసకర ఆటతో 5 ఇన్నింగ్స్‌ల్లో 376 పరుగులు చేసింది. అలాగే ఆఫ్‌స్పిన్ బౌలింగ్ చేయగలదు.
-
M02: Trailblazers vs Velocity – Shafali Verma Six https://t.co/fGXQzHYlWR via @ipl
— ebianfeatures (@ebianfeatures) September 6, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">M02: Trailblazers vs Velocity – Shafali Verma Six https://t.co/fGXQzHYlWR via @ipl
— ebianfeatures (@ebianfeatures) September 6, 2019M02: Trailblazers vs Velocity – Shafali Verma Six https://t.co/fGXQzHYlWR via @ipl
— ebianfeatures (@ebianfeatures) September 6, 2019
రెండో పిన్నవయస్కురాలు..
హరియాణాకు చెందిన 15 ఏళ్ల షెఫాలీ... భారత మహిళా క్రికెట్లో అతిపిన్న వయసులో అరంగేట్రం చేసిన రెండో అమ్మాయిగా పేరు తెచ్చుకుంది. అంతకు ముందు గ్రెయిగ్ బెనర్జీ 14 ఏళ్ల 165 రోజులకే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది.
వన్డేలకు మిథాలీ, టీ20లకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథులుగా కొనసాగుతున్నారు. సఫారీ జట్టుతో ఈనెల 24 నుంచి టీ20 సిరీస్, వచ్చే నెల 9 నుంచి వన్డే సిరీస్ ఆరంభంకానున్నాయి.
ఇదీ చదవండి...యూఎస్ ఓపెన్: ఫైనల్లో సెరెనాX ఆండ్రిస్కూ