Cricket In Olympics 2028 : క్రికెట్‌ను క్రేజ్ మరో రేంజ్‌కు తీసుకెళ్లేందుకు అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా 2028 లాస్‌ఏంజెలస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేర్చనున్నారు. దీంతో పాటు ఫ్లాగ్ ఫుట్‌బాల్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ను చేర్చబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
IOC Meeting In Mumbai : ఈ నెల 15 నుంచి 17 వరకు ముంబయిలో ఆరంభమయ్యే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ- ఐఓసీ సమావేశంలో ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే విషయాన్ని ఖరారు చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయమై ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్- ఐసీసీ.. లాస్ఏంజెలెస్ ఒలింపిక్ నిర్వాహక కమిటీతో కొంత కాలంగా సంప్రదింపులు జరుపుతోంది. తాజాగా 2028 ఒలింపిక్స్‌లో పలు క్రీడలతో పాటు క్రికెట్‌ను కూడా చేర్చాలని సిఫార్సు ఆ కమిటీ చేసింది.
ఈ విషయంపై ఐసీసీ ఛైర్మన్ గ్రెగ్ బార్క్లే స్పందించారు. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ఎల్ఏ28 సిఫార్సు చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అయితే ఇది తుది నిర్ణయం కానప్పటికీ.. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చూడడంలో ఇదో మైలురాయి అని అన్నారు. 'ఒలింపిక్స్‌లో కొత్త ఆటలు చేర్చే విషయంలో గత రెండు సంవత్సరాలుగా ఎల్ఏ28 చాలా సపోర్ట్ చేస్తోంది. అందుకు ఎల్ఏ28కి కృతజ్ఞతలు. ముంబయిలో జరగనున్న ఐఓసీ సమావేశంలో తీసుకునే తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం' అని బార్క్లే తెలపారు.
-
A massive step for cricket and its bid for inclusion at the 2028 Olympic Games.
— ICC (@ICC) October 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details 👇https://t.co/S7p3FzK2tk
">A massive step for cricket and its bid for inclusion at the 2028 Olympic Games.
— ICC (@ICC) October 9, 2023
Details 👇https://t.co/S7p3FzK2tkA massive step for cricket and its bid for inclusion at the 2028 Olympic Games.
— ICC (@ICC) October 9, 2023
Details 👇https://t.co/S7p3FzK2tk
ఒలింపిక్స్‌లో ఒకే ఒక్కసారి..
Cricket Olympics 1900 : ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఒకే ఒక్కసారి మాత్రమే (1900 క్రీడలు, పారిస్) చేర్చారు. ఇందులో ఫ్రాన్స్, గ్రేట్ బ్రిటన్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. రెండ్రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్ 158 పరుగుల తేడాతో గెలుపొంది స్వర్ణ పతకం అందుకుంది. ఓడిపోయిన ఫ్రాన్స్ టీమ్‌కు రజతం దక్కింది. రెండే టీమ్‌లు పాల్గొనడం వల్ల కాంస్య పతకానికి అవకాశం లేకుండా పోయింది.
128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఆట మళ్లీ ఒలింపిక్స్ ప్రేక్షకులను అలరించబోతోంది. ఇటీవలే ఆసియా క్రీడల్లో తరహాలో ఒలింపిక్స్‌లోనూ టీ20 ఫార్మాట్లో క్రికెట్ పోటీలు నిర్వహించే అవకాశముంది. గతేడాది కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్ చేరింది. తాజాగా చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగిన ఆసియా క్రీడల్లో పురుషులు, మహిళల విభాగాల్లో తొలిసారి క్రికెట్ పోటీలను నిర్వహించారు.
ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎందుకు లేదో తెలుసా?
T20 World Cup: అమెరికాలో టీ20 ప్రపంచకప్! ఒలింపిక్స్ కోసమేనా?