ETV Bharat / sports

CPL 2021: కరీబియన్ లీగ్ విజేతగా ఈసారి కొత్త జట్టు - ఐపీఎల్ 2021 విన్నర్

సెయింట్ కీట్స్ వేదికగా జరిగిన సీపీఎల్ ఫైనల్​లో St. కీట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్ జట్టు విజయం సాధించింది. ట్రోఫీని తొలిసారి సొంతం చేసుకుంది.

St Kitts & Nevis Patriots won maiden CPL title
కరీబియన్ ప్రీమియర్ లీగ్
author img

By

Published : Sep 16, 2021, 7:02 AM IST

కరీబియన్ ప్రీమియర్ లీగ్​లో(CPL) ఈసారి కొత్త జట్టు విజేతగా నిలిచింది. బుధవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్​లో సెయింట్ లూసియా కింగ్స్​ను ఓడించిన సెయింట్ కీట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్.. ట్రోఫీని ముద్దాడింది.

తొలుత టాస్ గెలిచిన లూసియా కింగ్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కార్న్​వాల్, ఛేజ్ తలో 43 పరుగులు చేయగా, కీమో పాల్ 39 పరుగులు సాధించాడు. మిగతా బ్యాట్స్​మన్ నామమాత్ర స్కోరుకే పరిమితమయ్యారు.

అనంతరం ఛేదనలో కీట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్ ఆచితూచి ఆడింది. ఓవర్లన్నీ ఆడి, లక్ష్యాన్ని పూర్తిచేసింది. జట్టులోని గేల్, బ్రావో లాంటి సీనియర్స్ విఫలమైనప్పటికీ, డొమినిక్ డ్రేక్స్ అద్భుత ప్రదర్శన చేశాడు. 48 పరుగులతో అజేయంగా నిలిచి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.