ముంబయి ఇండియన్స్ చీర్ లీడర్ గాబ్రియెల్లా పాస్క్వాలోట్టో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. చీర్ లీడర్ బృందం నుంచి తొలగించిన చాలా కాలం తర్వాత ఇప్పుడు మరోసారి ఐపీఎల్ మేనేజ్మెంట్పై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. క్రికెటర్లు తమతో అసభ్యంగా ప్రవర్తించడంపై గతంలో తన బ్లాగ్‌లో రాసిన వివరాలు నిజమేనని, యాజమాన్యం కూడా ఇలాంటి విషయాల్లో చూసి చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
"నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా నన్ను చీర్ లీడర్ బృందం నుంచి తొలగించారు. పార్టీల్లో మమ్మల్ని ఓ మాంసం ముద్దగానే చూసేవారు. నేను ఎవరో చెప్పిన విషయాలు నా బ్లాగ్‌లో రాయలేదు. బాహుశా.. నాపై ఫిర్యాదు చేసిన క్రికెటర్‌కు దోషిననే భావన కలిగి ఉండవచ్చు" అని గాబ్రియెల్లా చెప్పుకొచ్చారు.
ఐపీఎల్ చీర్ లీడర్ గాబ్రియెల్లా.. మొదట '@ఐపీఎల్ గర్ల్' అనే పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాలో తన అనుభవాలను తెలిపేది. అనంతరం ఆమె ఒక గుర్తుతెలియని వ్యక్తి పేరుతో ఓ బ్లాగ్‌ను నిర్వహించింది. అందులో ఐపీఎల్ పార్టీలు, క్రికెటర్ల గురించి తన అభిప్రాయాలను షేర్ చేసేది. గాబ్రియెల్లా నిర్వహిస్తున్న బ్లాగ్ గురించి ఓ క్రికెటర్‌కు ఎవరో ఫిర్యాదు చేయగా.. ఆమెను చీర్ బృందం నుంచి తొలగించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: పంత్‌కు కరోనా.. అక్కడికి వెళ్లడం వల్లేనా?