రెండు దశాబ్దాల పాటు సాగిన తన క్రికెట్ ప్రస్థానానికి భారత మహిళా జట్టు సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి వీడ్కోలు పలకనున్న విషయం తెలిసిందే. కెరీర్‌లో నేడు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో జరుగుతోంది. అయితే ఈ వీడ్కోలు మ్యాచ్‌కు ముందు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కంటతడి పెట్టింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డే టాస్‌కు ముందు జట్టు సభ్యులు ఝులన్ గురించి మాట్లాడి ఆమెకు జ్ఞాపికలు అందజేశారు. ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో సీనియర్ పేసర్‌కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ భావోద్వేగానికి గురై ఝులన్‌ను హత్తుకొని కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గోస్వామితోపాటు బీసీసీఐ మహిళా అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఝులన్ కెప్టెన్సీలోనే హర్మన్ అరంగేట్రం చేయడం విశేషం.
కాగా, 2002లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఝులన్.. నాలుగేళ్ల క్రితం టీ20లకు స్వస్తి పలికింది. ఆమె కెరీర్‌లో మొత్తం ఆరు వన్డే ప్రపంచకప్‌లకు ప్రాతినిధ్యం వహించింది. వన్డే ఫార్మట్లలో 200 వికెట్ల మైలు రాయిని అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 203 వన్డేలు ఆడిన ఈ సీనియర్ పేసర్ ఇప్పటివరకు 253 వికెట్లు పడగొట్టింది.
-
Harmanpreet Kaur in tears for Jhulan Goswami's last match #ENGvIND | #ThankYouJhulan pic.twitter.com/I8no7MhBSq
— Jhulan GOATswami (@Alyssa_Healy77) September 24, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">Harmanpreet Kaur in tears for Jhulan Goswami's last match #ENGvIND | #ThankYouJhulan pic.twitter.com/I8no7MhBSq
— Jhulan GOATswami (@Alyssa_Healy77) September 24, 2022Harmanpreet Kaur in tears for Jhulan Goswami's last match #ENGvIND | #ThankYouJhulan pic.twitter.com/I8no7MhBSq
— Jhulan GOATswami (@Alyssa_Healy77) September 24, 2022
ఇదీ చూడండి: నా కెరీర్‌లో అదొక్కటే అసంతృప్తి: ఝులన్ గోస్వామి